శ్రీను వైట్ల తో అఖిల్ నెక్స్ట్ సినిమా… నాగ్ ఒప్పుకుంటాడా..?

ఒక స్టార్ హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా మూడు ఫ్లాప్ లు అందుకుని ఉండదు. అయితే అఖిల్ మాత్రం ఫ్లాపుల్లో హ్యాట్రిక్ పూర్తి చేసేసాడు. ‘అఖిల్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఆ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ… డ్యాన్స్, ఫైట్స్ విషయంలో మాత్రం ఇరగదీశాడనే చెప్పాలి. అక్కినేని ఫ్యామిలీలో మాస్ హీరోగా నిలదొక్కుకోవడం కాయమనుకున్నారంతా. అయితే అఖిల్… యాక్షన్ హీరోగా ట్రై చేద్దామని ‘హలో’ చేసాడు. నిజానికి ఈ చిత్రానికి మంచి టాక్, రివ్యూలు వచ్చాయి.

కానీ కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. ఇక లవ్ స్టోరీతో అయినా హిట్టందుకుందామని ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేసాడు. ఈ చిత్రానికి కూడా డీసెంట్ టాక్, రివ్యూలు దక్కాయి కానీ… డిజాస్టర్ సినిమా అయిన ‘అఖిల్’ కలెక్షన్లు కూడా ఈ చిత్రానికి రాలేదు. ఒక పక్క సక్సెస్ టూర్లు తిరిగుతున్నప్పటికీ… కనీసం కలెక్షన్లు కూడా రావట్లేదు. అయితే హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు అఖిల్ లో పుష్కలంగా ఉన్నాయి. డాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు…మరి లోపం ఎక్కడుందో తెలీక అఖిల్ సతమవుతున్నాడట. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా విషయంలో డైలమాలో పడ్డాడు అఖిల్.

అయితే వరుస డిజాస్టర్స్ తో ఉన్న శ్రీను వైట్ల… అఖిల్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామాని సిద్ధం చేసాడట. రీసెంట్ గా శ్రీనువైట్ల.. అఖిల్ ని కలిసి కథ వినిపించాడట. దీనికి అఖిల్ పాజిటివ్ గా స్పందించాడట. అయితే శ్రీను వైట్ల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి. గత 5 ఏళ్ళుగా శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన చిత్రాలన్నీ డిజాస్టర్లు గానే మిగిలాయి. ఇక ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలైతే… 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ తరువాతి సినిమా శ్రీనువైట్లతో చేయడానికి నాగార్జున ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న..? మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను నే రిజెక్ట్ చేసాడు నాగ్..! అలాంటిది అఖిల్ ను…. శ్రీను వైట్ల చేతిలో పెట్టే పరిస్థితి లేదనే చెప్పాలి..! ఇప్పుడు తన కొడుకుకి హిట్ ఇవ్వాలని పెద్ద పెద్ద దర్శకులను సంప్రదిస్తున్నాడట నాగ్. ఎంత బడ్జెట్ అయినా తానే నిర్మిస్తానని ఆఫర్ కూడా ఇస్తున్నాడట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Share.