రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!

టెలివిజన్ హోస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారిన ఓంకార్ తెరకెక్కించిన తాజా చిత్రం “రాజుగారి గది 3”. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి రెండు చిత్రాలు మంచి విజయం సాధించి ఉండడంతో.. ఈ మూడో భాగానికి కూడా మంచి క్రేజ్ వస్తుంది అనుకున్నారు కానీ.. ఎందుకో ఆశించిన స్థాయి అటెన్షన్ ను గ్రాబ్ చేయలేకపోయింది. కామెడీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో ఓంకార్ తన చాలా అవసరమైన విజయాన్ని అందుకొన్నాడో లేదో చూద్దాం..!!

raju-gari-gadhi-3-movie-review1

కథ: రౌడీ ఆటో డ్రైవర్ అశ్విన్ (అశ్విన్ బాబు) కేర్ లెస్ గా బ్రతికేస్తుంటాడు. అతడి బిహేవియర్ కారణంగా కాలనీ వాళ్ళందరూ చాలా ఇబ్బందిపడుతుంటారు. ఎలాగైనా అశ్విన్ పీడ వదిలించుకోవడం కోసం అదే కాలనీలో ఉండే మాయ (అవికా గోర్)తో ప్రేమలో పడేలా చేస్తారు. అందుకు కారణం ఏంటంటే.. మాయకి ఒక విచిత్రమైన గతం ఉంటుంది. ఆ గతం కారణంగా ఆమెకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఒక దెయ్యం వచ్చి వాళ్ళని చితక్కొట్టేస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం.

సో, అశ్విన్ ప్రపోజ్ చేసిన తర్వాత దెయ్యం అతడిని వెంబడిస్తుంది. ఆ దెయ్యం బారి నుండి అశ్విన్ ఎలా తప్పించుకున్నాడు? అనేది “రాజుగారి గది 3” కథాంశం.

raju-gari-gadhi-3-movie-review2

నటీనటుల పనితీరు: మొదటి మూడు సినిమాలతో పోల్చి చూస్తే అశ్విన్ బాబు కాస్త డెవలప్ అయ్యాడు. లుక్స్ పరంగా కంటే పెర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా కాస్త అతి చేసాడు అనిపించినా జోనర్ కి సరిపోయింది.

అవికా గోర్ క్యారెక్టర్ బాగున్నా. ఆమె క్యారెక్టరైజేషన్ మాత్రం క్లారిటీ ఉండదు. లాజికల్ గా కూడా చాలా సిల్లీగా ఉంటుంది. పోనీ లాజిక్స్ అవసరం లేదులే అనుకుంటే.. ఫస్టాఫ్ లో వచ్చే సీన్స్ మరీ బోర్ కొట్టిస్తాయి.

అలీ, ధనరాజ్ ల కామెడీ ప్రేక్షకుల్ని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ కూడా వాళ్ళే.

raju-gari-gadhi-3-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: షబీర్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మరీ లౌడ్ గా ఉంది. హారర్ ఎపిసోడ్స్ కి స్కోర్ మాత్రం బాగుంది. చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా పర్వాలేదు.

రాజుగారి గదిలో షకలక శంకర్ కామెడీ హిలేరియస్ గా ఉంది. సెకండ్ పార్ట్ లో వెన్నెల కిషోర్ కాస్త పర్వాలేదనిపించాడు. మూడో భాగంలో మాత్రం కామెడీ లేని లోటు బాగా కనిపించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో అసలు కథ ఎక్కడుందా అని వెతుక్కుంటూ కూర్చున్న ప్రేక్షకుడు.. సెకండాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయ్యాక సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తుంటాడు. కథను తమిళ చిత్రం “దిల్లుకు దుడ్డు 2” నుంచి స్ఫూర్తిగా తీసుకున్న ఓంకార్.. “రాజుగారి గది 3″కి ఆ ఎంటర్ టైన్మెంట్ ను మిక్స్ చేయలేకపోయాడు. అలాగే.. ఫస్టాఫ్ మరీ ఎక్కువగా సాగదీసాడు. సెకండాఫ్ లో ఫన్ ఉంది కానీ.. కథ లేదు. అందువల్ల అలీ, ధనరాజ్ ల కామెడీ బాగున్నప్పటికీ.. సాగిన కథనం కారణంగా ఆ కామెడీని కూడా సరిగా ఎంజాయ్ చేయలేరు.

raju-gari-gadhi-3-movie-review4

విశ్లేషణ: “కాంచన 3” సినిమాలోని రిపీటెడ్ కామెడీనే ప్రేక్షకులు భీభత్సంగా ఎంజాయ్ చేశారు. అటువంటి ప్రేక్షకులకు “రాజుగారి గది 3” నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇప్పుడు ఉన్న పోటీకి వచ్చేవారం విజిల్ రెడీగా ఉండడంతో.. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సేఫ్ జోన్ లో పడడం కాస్త కష్టమే.

raju-gari-gadhi-3-movie-review5

రేటింగ్: 1.5/5

Click Here To Read In ENGLISH

Share.