వీరభోగ వసంత రాయులు

“కల్ట్ సినిమా” అంటూ పోస్టర్స్ నుంచే ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన సినిమా “వీరభోగ వసంతరాయులు”. యువ దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ టీజర్, ట్రైలర్ మంచి అంచనాలు రేకెత్తించాయి. మంచి క్యాస్టింగ్ కూడా తొడవ్వడంతో ఈ సినిమా తప్పకుండా మరో మంచి సినిమాగా మిగిలిపోతుందని భావించారు విశ్లేషకులు. మరి వారి అంచనాలను దర్శకుడు అందుకోగలిగాడా లేదా అనేది సమీక్షలో చూసుకుందాం..!!

vbvr-5
కథ : నిజానికి ఈ సినిమాది చాలా ఆసక్తికరమైన కథ. సి.ఐ వినయ్ (సుధీర్ బాబు) వద్దకు ఒక కుర్రాడు తన ఇల్లు పోయింది అని కంప్లైంట్ తో వస్తాడు. ఇల్లు పోవడం ఏంటా అని ఆసక్తికరంగా మొదలైన ఇన్వెస్టిగేషన్ కీలకమైన మలుపులు తిరుగుతుంది.
కట్ చేస్తే.. 300 మంది ప్రయాణికులతో మిస్ అయిన బోయింగ్ 737 విమానాన్ని వీరభోగ వసంతరాయులు (శ్రీవిష్ణు) హైజాక్ చేయడంతో ఆ కేస్ ను డీల్ చేయమని కేంద్ర ప్రభుత్వం దీపక్ రెడ్డి (నారా రోహిత్) మరియు నీలిమ (శ్రియా శరణ్) లకు అప్పగిస్తుంది.
మళ్ళీ కట్ చేస్తే.. సరోజినీ అనాధ శరణాలయంలోని పిల్లలు మిస్ అవుతుంటారు. ఒక హ్యూమన్ ట్రాఫిక్కింగ్ గ్యాంగ్ ఆ చిన్నారుల్ని లైంగికంగా వేధించి విదేశాలకు అమ్మేయడం లేదా చంపేయడం చేస్తుంటారు. ఆ కేస్ ను ఓ సాధారణ కానిస్టేబుల్ (శశాంక్) ప్రయివేట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.
ఇలా ఈ మూడు విభిన్నమైన కేసులకు కీ మాత్రం ఒక్కటే అదే “వీరభోగ వసంతరాయులు”.
మూడు కేసులకు ఒక్కటే సమాధానం ఏంటీ అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే థియేటర్ లో సినిమా చూడాల్సిందే.

vbvr-1
నటీనటుల పనితీరు : నారా రోహిత్ రోల్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు కానీ.. క్యారెక్టర్ కి డెప్త్ & క్లారిటీ లేదు. శ్రియ క్యారెక్టర్ చూడ్డానికి కొత్తగా ఉన్నప్పటికీ.. ఆమె డబ్బింగ్ బాగోలేకపోవడంతో సింక్ అవ్వదు. ఇక సుధీర్ బాబు క్యారెక్టర్ కి డెప్త్ & క్లారిటీ ఉన్నప్పటికీ.. మనోడు డబ్బింగ్ చెప్పకపోవడంతో ఏదో హాలీవుడ్ సినిమాకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూస్తున్న భావన కలుగుతుంది.

పాపం శ్రీవిష్ణు కొత్తగా కనిపించాడు కానీ, క్యారెక్టర్ కి మంచి డెప్త్ ఉన్నప్పటికీ.. క్లారిటీ లేకపోవడంతో అతగాడి క్యారెక్టర్ కూడా అర్ధం కాదు. దాంతో బాబుకి చేయించిన హెయిర్ కట్ వేస్ట్ అయ్యింది.ఇంకా సినిమాలో చాలా మంది ఉన్నప్పటికీ.. వాళ్లందరి గురించి చెప్పుకోవడం కూడా అప్రస్తుతమే.

vbvr-2
సాంకేతికవర్గం పనితీరు : ముందు అనుకున్నట్లుగా.. కథగా “వీర భోగ వసంతరాయులు” చాలా మంచి సినిమా. కానీ.. దర్శకుడికి లోపించిన క్లారిటీ కారణంగా స్క్రీన్ ప్లేతో తాను కన్ఫ్యూజ్ అయ్యి.. జనాల్ని కన్ఫ్యూజ్ చేసి “ఈ డైరెక్టర్ అసలు ఏం చెప్పాలనుకున్నాడు” అని ప్రతి ప్రేక్షకుడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేలా చేశాడు. చిక్కు ముడులు వేయడం సులభ, కానీ.. ఆ మూడులను విప్పడం కష్టం అన్నట్లుగా, దర్శకుడు ఫస్టాఫ్ లో వేసిన చిక్కుముడులను ప్రీక్లైమాక్స్ లో రివీల్ చేసే విధానం కనీస స్థాయిలో కూడా ఆసక్తిరేపకపోవడంతో అప్పటివరకూ ఒక ఫామ్ లో ఉన్న సినిమా పాతాళానికి కూరుకుపోయింది. బేసిగ్గా.. ఈ సినిమా మల్టీ డైమెన్షనల్ స్క్రీన్ ప్లే.. ఆ డాట్స్ అన్నీ క్లైమాక్స్ లో కనెక్ట్ అవ్వాలి. కానీ.. క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం క్లారిటీ ఇవ్వకపోగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఆ కారణంగా “వీర భోగ వసంత రాయులు” ఒక టిపికల్ ఎక్స్ పెరిమెంట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.

కెమెరా వర్క్ బాగున్నప్పటికీ.. సీజీ షాట్స్ చాలా చీప్ గా ఉంటాయి. అలాగే.. ప్రొడక్షన్ వేల్యూస్ అస్సలు బాగోవు. ఇక నేపధ్య సంగీతం ఏదో కొరియన్ సిరీస్ ను గుర్తుచేస్తుంటుంది.

vbvr-3

విశ్లేషణ : ఏదో చేద్దామని మొదలెట్టి ఇంకోదో చూశారన్నట్లుగా సాగే సినిమా “వీర భోగ వసంతరాయులు”. మంచి క్యాస్టింగ్ ను సరిగా వినియోగించుకోలేకపోతే పరిస్థితి ఏమిటి అనేందుకు ఈ చిత్రం ఒక ఉదాహరణ. అయినా.. సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ దాన్ని “కల్ట్” అనాలి కానీ.. పోస్టర్స్ లోనే కల్ట్ అని వేయించుకోవడం అనేది ఆ దర్శకుడి ప్రతిభకు, ఓవర్ కాన్ఫిడెన్స్ కు తార్కాణం. vbvr-4
రేటింగ్ : 1/5

Share.