ఓడియన్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం “ఒడియన్”. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు.. రూపాలు మార్చి జనాల్ని భయపెట్టే “ఒడియన్” జాతి మనుషులు ఉండేవారు. మలయాళ రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన “ఒడియన్” కథల నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ లాల్ కూడా ఒడియన్ గా నటించడం విశేషం. మేకింగ్ టైమ్ లోనే విశేషమైన ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

odiyan-movie-telugu-review1

కథ : ఒడియన్ మాణిక్యం (మోహన్ లాల్) తన అనుకున్నవారిని, సొంత ఊరుని వదులుకొని కాశీలో నివసిస్తుంటాడు. ఒకానొక సందర్భంలో తన సొంత ఊరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా తనని ప్రేమించిన ప్రభ (మంజు వారియర్) ప్రాణానికి అపాయం ఉందని తెలుసుకొని.. 15 ఏళ్ల తర్వాత తన స్వస్థలానికి బయలుదేరతాడు. తాను ఊరు నుంచి వెళ్లిపోవడానికి కారకుడైన రాజారావు (ప్రకాష్ రాజ్) వల్లే ప్రభ కూడా బ్బందిపడుతోందని తెలుసుకొని అతడ్ని ఎదిరించడానికి మళ్ళీ ఒడియన్ అవతారం ఎత్తుతాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “ఒడియన్” కథ.

odiyan-movie-telugu-review2

నటీనటుల పనితీరు : మోహన్ లాల్ నటవిశ్వరూపం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం మోహన్ లాల్ మరింత కష్టపడి ఫ్లాష్ బ్యాక్ కోసం ఏకంగా 30 కేజీలు తగ్గడం అనేది అభినందనీయం మాత్రమే కాదు స్పూర్తిదాయకం కూడా. అలాగే.. ఫైట్ సీన్స్ లో మోహన్ లాల్ చూపిన తెగువ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.

మంజు వారియర్ క్యారెక్టర్ కి తగ్గట్లుగా తనను తాను మలుచుకుని వేరియేషన్స్ చూపించింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలనిజాన్ని కొత్తగా ప్రదర్శించడానికి ప్రయత్నించాడు కానీ.. రెగ్యులర్ గానే అనిపించింది.

odiyan-movie-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు : టెక్నికల్ గా మలయాళం నుంచి వచ్చిన ఒన్నాఫ్ ది బెస్ట్ ఫిలిమ్ “ఒడియన్”. మోహన్ లాల్ ఒడియన్ గా రూపాంతరం చేదే సీక్వెన్స్ లు, ముఖ్యంగా ఒడియన్ క్లైమాక్స్ ఫైట్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. కలరింగ్ కానీ డి.ఐ కానీ ప్రేక్షకులకి ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఇంటర్నేషన్ లెవెల్ లో ఉన్నాయి.

టెక్నికల్ గా ఇంత అద్భుతంగా ఉన్న ఈ సినిమాకి కథ-కథనం బిగ్గెస్ట్ మైనస్. మనకు తెలియని “ఒడియన్” అనే అంశాన్ని పరిచయం చేయాలనుకున్న దర్శకుడి ఆలోచన బాగుంది కానీ.. అది అర్ధమయ్యే రీతిలో చెప్పి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఇక కథనమైతే మైదాపిండి ముద్దలా సాగుతూనే ఉంది. ముఖ్యంగా.. పారలెల్ స్క్రీన్ ప్లే పేరుతో దర్శకుడి కథను ఖూనీ చేశాడనే చెప్పాలి. ఆ సన్నివేశాల అల్లికతో సినిమా ఎప్పుడు అవుతుందా అని ప్రేక్షకుడు ఎదురుచూసేలా చేశాడు.

odiyan-movie-telugu-review4

విశ్లేషణ : కేవలం మోహన్ లాల్ నటవిశ్వరూపాన్ని, కొన్ని ఫైట్స్ ను చూడడం కోసం మాత్రమే జనాలు థియేటర్లకి రారు. ఆ రెండిటితోపాటు ఆకట్టుకొనే కథ, కథనం కూడా ఉండాలి. అవి లేనప్పుడు ఎంత భారీ బడ్జెట్ సినిమానైనా ప్రేక్షకులు ఆదరించరు. “ఒడియన్” ఆ తరహా సినిమానే. అద్భుతమైన ప్రొడక్షన్ వేల్యూస్, అబ్బురపరిచే పోరాట సన్నివేశాలు, అద్వితీయమైన మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజన్స్. ఇలా ఎన్ని ఉన్నా.. ప్రేక్షకులను మాత్రం బోర్ కొట్టించింది.

odiyan-movie-telugu-review5

రేటింగ్ : 1.5/5

Click Here To Read In ENGLISH

Share.