2.O

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఇండియాస్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మరో అద్భుతమైన చిత్రం “2.0”. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నెగిటివ్ రోల్లో నటించిన ఈ చిత్రం గత మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. నిజానికి గతేడాది విడుదలకావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ అనుకున్న సమయానికి పూర్తవ్వని కారణంగా పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఇవాళ (నవంబర్ 29) విడుదలైంది. మరి టీజర్, ట్రైలర్ లతో క్రియేట్ చేసిన భారీ ఇంపాక్ట్ ను ఈ చిత్రం అంగుకోగలిగిందా? శంకర్ కష్టానికి ప్రతిఫలం లభించిందా? లేదా? చూద్దాం..!!

robo-1

కథ : పక్షుల మీద విశేషమైన ప్రేమ కలిగి ఉండడమే కాక ఆ పక్షుల మీద రీసెర్చ్ చేస్తూ.. సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా అర్ధాంతరంగా కోల్పోతున్న వాటి ఉనికిని కాపాడడం కోసం అనునిత్యం పరితపించిన డాక్టర్ రాజు అలియాస్ పక్షీరాజు (అక్షయ్ కుమార్) పక్షులను కాపాడలేకపోతున్నాను అనే బాధతో ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. అతడి మరణం అనంతరం చెన్నై దరిదాపుల్లో ఉన్న ముబైల్ ఫోన్స్ అన్నీ గాల్లో ఎగిరి ఎక్కడికో వెళ్లిపోతుంటాయి. ఉన్నట్లుండి మొబైల్ కంపెనీ ఓనర్లు, టెలికాం మినిస్టర్లు మరణిస్తుంటారు. ఊహకు అందని విధంగా జరుగుతున్న ఈ విపత్కర పరిస్థితులను కంట్రోల్ లోకి తీసుకొచ్చేందుకు ఎనిమిదేళ్ళ క్రితం డిస్ మాంటిల్ చేసి మ్యూజియంలో పెట్టబడిన చిట్టిని మళ్ళీ తీసుకొస్తాడు డాక్టర్ వశీకర్ (రజనీకాంత్).

ఇంతకీ పక్షీరాజు మరణానికి, సిటీలో సెల్ ఫోన్లు ఉన్నట్లుండి ఎగిరిపోవడానికి మధ్య సంబంధం ఏమిటి? ఈ పరిస్థితులను చిట్టి కంట్రోల్ లోకి తీసుకోగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం “2.0” చిత్రాన్ని అర్జెంట్ గా 3Dలో చూడాల్సిందే.

robo-2

నటీనటుల పనితీరు : సాధారణంగా వెండితెరపై ఒక్క రజనీకాంత్ ను చూస్తేనే అభిమానుల ఆనందం అంబరాన్ని తాకుతుంటుంది. అలాంటిది ఈ చిత్రంలో ఏకంగా ముగ్గురు రజనీకాంత్ లు.. ఈ ముగ్గురు కాకుండా మళ్ళీ క్లైమాక్స్ లో ఒక బుల్లి రజనీకాంత్ చేసే రచ్చ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. పైగా.. శంకర్ మాయాజాలం తొడవ్వడంతో రజనీ నిజంగానే సూపర్ హీరోలా కనిపించాడు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ మరియు ఆయన చూపే వేరియేషన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్స్. లేడీ రోబోగా అమీ జాక్సన్ సినిమాకి గ్లామర్ ను యాడ్ చేసింది.

నెగిటివ్ రోల్లో అక్షయ్ కుమార్ నటుడిగా ఆకట్టుకొన్నప్పటికీ.. ఆయన క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడంతో ఆడియన్స్ ఆయన కాజ్ కి కనెక్ట్ అవుతారు కానీ.. క్యారెక్టర్ కి మాత్రం కనెక్ట్ అవ్వలేరు.

robo-3

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు శంకర్ విజన్ కి ప్రతిరూపం లాంటి “2.0” టెక్నికల్ గా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. 3Dలో మాత్రమే ఈ చిత్రాన్ని చూడమని ఎందుకు అంతలా వేడుకొన్నాడు అనేది సినిమా మొదలైన మొదటి 5 సెకన్లలోనే అర్ధమైపోతుంది. టైటిల్ కార్డ్స్ దగ్గర మొదలైన శంకర్ టెక్నికల్ బ్రిలియన్స్ చివరి ఫ్రేమ్ వరకూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో గెయింట్ రోబోతో భారీ పక్షి రూపంలో ఉన్న సెల్ ఫోన్ల సమూహంతో పోరాడే భారీ ఫైట్ సీక్వెన్స్ ఓ భారీ బడ్గెట్ హాలీవుడ్ సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.

టెక్నికల్ గా అద్భుతంగా ఉన్న ఈ చిత్రం ఎమోషనల్ గా మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ప్రీక్వెల్లో ఉన్న మినిమం ఎమోషనల్ కనెక్టివిటీ కూడా లేకపోవడం సినిమాకి మైనస్. శంకర్ ఎంచుకున్న పాయింట్ యూనీక్ గా ఉన్నప్పటికీ.. దాన్ని నడిపించిన విధానం ఆకట్టుకొనే విధంగా లేదు. పైగా.. అక్షర్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది తప్పితే సినిమాకి కనెక్ట్ అవ్వలేదు. టెక్నికల్ మూవీలో దెయ్యం అనే కాన్సెప్ట్ ను తీసుకురావడం కూడా మైనస్ లా మారింది. సొ, లాజికల్ గా ఆలోచిస్తే మాత్రం ఈ సినిమా కాస్త నిరాశకు గురి చేసే అవకాశం ఉంది. అయితే.. శంకర్ మ్యాజిక్ కి రజనీకాంత్ మాస్ పెర్ఫార్మెన్స్ తొడవ్వడంతో ఆ లాజిక్స్ ను కామన్ ఆడియన్స్ పెద్దగా కేర్ చేయరు.

నిరవ్ షా సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవగా.. ఫస్ట్ పార్ట్ కి ప్లస్ పాయింట్ లా నిలిచిన రెహమాన్ నేపధ్య సంగీతం ఇందులో మిస్ అయ్యింది. అలాగే.. ఒక డైరెక్టర్ గా సక్సెస్ అయిన శంకర్ స్టోరీ టెల్లర్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడు.

robo-4

విశ్లేషణ : ఇదొక టెక్నలాజికల్ మార్వెల్ కానీ.. ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. సో.. శంకర్ మ్యాజిక్ ను, రజనీ మ్యానియాను ఎంజాయ్ చేయడానికి వెళ్తే పూర్తిస్థాయిలో సంతుష్టులవుతారు. అదే.. లాజిక్ ను పట్టించుకొంటే మాత్రం నిరాశచెందే అవకాశాలు కాస్త ఉన్నాయి. ఓవరాల్ గా.. “2.0” మాగ్జిమమ్ ఆడియన్స్ ను సాటిస్ఫై చేసే విజువల్ వండర్.

robo-5

రేటింగ్ : 3.5/5

Share.