జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

“అ!, కల్కి” చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ “జాంబి రెడ్డి”. మోస్ట్ పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ 90’S తేజ సజ్జా పూర్తిస్థాయి కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో “హోరా హోరీ, హుషారు” ఫేమ్ దక్ష నగార్కర్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో రూపొందిన మొట్టమొదటి జాంబీ సినిమాగా ప్రచారం చేయబడుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: మారియో (తేజ సజ్జా) ఓ గేమ్ డిజైనర్. తన స్నేహితుడు కళ్యాణ్ (మిర్చి హేమంత్) గేమ్ కోడింగ్ ఫినిష్ చేయకుండా పెళ్ళి చేసుకోవడానికి వెళ్లిపోవడంతో.. కర్నూలు చేరుకుంటారు మారియో & గ్యాంగ్. పెళ్ళికి వచ్చినవాళ్లు జాంబీలతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఇంతకీ కర్నూలులో జాంబీలు ఎలా ప్రవేశించాయి? మారియో ఆ జాంబీలను ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి ఏం జరిగింది? అనేది “జాంబిరెడ్డి” కథాంశం.

నటీనటుల పనితీరు: తేజ సజ్జా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. లుక్స్, మేనరిజమ్స్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోగా తనకు మంచి ఫ్యూచర్ ఉంది. తెలుగమ్మాయి ఆనంది చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించింది. దక్ష నగార్కర్ గేమర్ గా గ్లామర్ తోపాటు కామెడీ కూడా అద్దింది. హేమంత్, జబర్దస్త్ శ్రీనులు ఉన్న కాసిన్ని సన్నివేశాల్లోనూ చక్కగా నవ్వించారు. వినయ్ వర్మ, వీరారెడ్డిగా నటించిన సీనియర్ రంగస్థల నటుడు అలరిస్తారు.

సాంకేతికవర్గం పనితీరు: మార్క్ కె.రాబిన్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. పాటలు, బీజీయమ్ ట్రెండీగా ఉన్నాయి. అనిత్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ & మేకప్ బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ జాగ్రత్తగా వర్క్ చేశారు. ప్రశాంత్ వర్మ కథను మొదలుపెట్టిన విధానం బాగుంది. ఫస్టాఫ్ ను కామెడీ, సస్పెన్స్ తో బాగా నడిపాడు. సెకండాఫ్ కి వచ్చేసరికి కథ కంగారుపడింది, కథనం ట్రాక్ తప్పింది. జాతర ఫైట్ సీక్వెన్స్ లెంగ్త్ ఎక్కువైంది. అందువల్ల ఆసక్తి తగ్గుతూ వస్తుంది.

ఇక ఎండింగ్ కి వచ్చేసరికి దేవుడే దిక్కు అన్నట్లు వదిలేశాడు ప్రశాంత్ వర్మ. పదుల సంఖ్యలో హాలీవుడ్ సినిమాల స్పూర్తి, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోని పాత్రల స్పూఫ్ లు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల సినిమాని పెద్దగా ఎంజాయ్ చేయలేం. అయితే.. మొత్తానికి పేరడీ సినిమాగా తీసేసినా బాగుండేది. అలా కాదని ఓన్ ఐడియాలా ప్రొజెక్ట్ చేయడానికి చాలా తపించాడు ప్రశాంత్. అక్కడే సగం సినిమా దెబ్బపడింది.

విశ్లేషణ: రకరకాల జాంబీ సినిమాలు చూసి చూసి ఉన్నవాళ్ళకు ఈ సినిమా పెద్దగా ఎక్కదు. రెగ్యులర్ ఆడియన్స్ పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేరు. మార్క్ కె.రాబిన్ మ్యూజిక్, ఎండ్ క్రెడిట్స్ & కొన్ని ఫన్నీ సీన్స్ కోసం ఒకసారి చూడదగిన చిత్రం “జాంబీ రెడ్డి”.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Share.