పైసానే పరమాత్మ..మహేష్ మోసగాడా? ..మొగుడా?

మహేష్ ఫ్యాన్స్ నేడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కొత్త రికార్డులే లక్ష్యంగా మహేష్ బర్త్ డే ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ నేడు తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ కి భౌతిక వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనితో మహేష్ ఫ్యాన్స్ వారి సంతోషాన్ని, పండుగను సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మరి మహేష్ పై ఇంత ప్రేమ చూపిస్తున్న ఫ్యాన్స్ కోసం ఆయన కూడా ఓ గిఫ్ట్ తేవాలిగా.

అందుకే మహేష్ తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్రం నుండి ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ఆ మోషన్ పోస్టర్ సరికొత్తగా ఉంది. మోషన్ పోస్టర్ లో మొత్తం రూపాయి కాయిన్ హైలెట్ చేయగా, గాల్లోకి మహేష్ కాయిన్ ఎగురవేయడం ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే ఈ మూవీ నేపథ్యంపై కొన్ని కథనాలు రావడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, దోపిడీలు ఈ మూవీ ప్రధాన నేపథ్యం అనేది ఆ కథనాల సారాంశం.

నేటి మోషన్ పోస్టర్ తో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చింది. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో మహేష్ పాత్ర ఏమిటనేది ఆసక్తికరం. మహేష్ డబ్బు కోసం మోసాలు చేసేవాడా, మోసాలు చేసిన వాళ్ళ అటకట్టించేవాడో అనేది చూడాలి. దర్శకుడు పరుశురాం మాత్రం ఓ సరికొత్త కథతో మహేష్ ని భిన్నంగా ప్రెజెంట్ చేస్తారు అనిపిస్తుంది. మొత్తంగా మోషన్ పోస్టర్ మూవీపై మరింత హైప్ పెంచేదిగా ఉంది.

Share.