Remembering Iconic Characters From K. Vishwanath Gari Movies On His Birth Anniversary

1. శంకరశాస్త్రి (శంకరాభరణం) 

ముందుగా ఈ పాత్రకి విశ్వనాథ్ గారు అనుకున్న నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు గారు. కానీ కొన్ని కారణాల వల్ల సోమయాజులు గారు చేయాల్సి వచ్చింది. సినిమాకి ఆయువుపట్టు లాంటి శంకరశాస్త్రి పాత్రకి నిజంగా సోమయాజులు గారు ప్రాణం పెట్టేశారు 

2. తులసి (శంకరాభరణం) 

‘శంకరాభరణం’లో తులసి పాత్రకి మంజుభార్గవి గారిని తీసుకోవడం పెద్ద సాహసమే. ఎందుకంటే.. అంతకు ముందు సినిమాల్లో ఆవిడ కొన్ని వ్యాంప్ లాంటి పాత్రల్లో కనిపించారు. 

3. శివయ్య (స్వాతిముత్యం) 

కల్లాకపటం ఎరుగని పసిపాప మనసు ఈ సినిమాలో శివయ్యది. ఇలాంటి ఒక అమాయకమైన పాత్ర ద్వారా కమల్ హాసన్ లాంటి నటుడు మరోసారి తనలోని నట ‘విశ్వ’రూపాన్ని మనకు పరిచయం చేశారు.  

4. బాలు (సాగర సంగమం) 

బాలు.. జీవితంలో ఓడిపోయిన ఒక సగటు మనిషి. ఒక ఫెయిల్యూర్. మాసిన గడ్డం, పాత చొక్కా, భుజానికి సంచి, అందులో మందుసీసా… చూడగానే వీడేంటి ఇలా ఉన్నాడు అని అనిపించే ఒక పాత్రలో కమల్ ని మనం చూడగలమా..? 

5. సాంబయ్య (స్వయంకృషి) 

అప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించి, డాన్స్ కి మారుపేరుగా ఒక ఊపు ఊపేస్తూ మెగాస్టార్ అని పిలిపించుకుంటున్న మన చిరంజీవి గారు.. చెప్పులు కుట్టే ఇలాంటి పాత్రలోనా..?  

6. లలిత (స్వాతిముత్యం) 

అప్పటికే టాప్ హీరోయిన్ రాధిక గారు. అప్పటి హీరోలందరి పక్కన నటిస్తూ స్టార్ డమ్ చూస్తున్న టైం అది. అలాంటి రాధిక గారు.. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ‘స్వాతిముత్యం’  

7. గంగాధరం (స్వాతికిరణం) 

మన చిన్నప్పుడు మాల్గుడి కథలు అని ఓ సీరియల్ ప్రతి ఆదివారం వచ్చేది.. గుర్తుందా..? అందులో స్వామిగా మనకు బాగా దగ్గరైన మాస్టర్ మంజునాథ్.. ఈ సినిమాలో గంగాధరం పాత్రలో చక్కగా నటించాడు.  

8. మాధవయ్య (శంకరాభరణం) 

‘శంకరాభరణం’ చిత్రానికి మరొక హీరో ఎవరైనా ఉన్నారంటే అది.. ఈ సినిమాలో ఈ పాత్రే. లాయర్ మాధవయ్య పాత్రలో అల్లు రామలింగయ్య గారు అద్భుతంగా నటించారు. 

9. సుభాషిణి (సిరివెన్నెల) 

సుహాసిని గారు చేసిన అద్భుతమైన పాత్రల గురించి చెప్పాల్సినప్పుడు.. మనం ముందుగా ‘సిరివెన్నెల’ సినిమాలో చేసిన ఈ సుభాషిణి పాత్రను తప్పక గుర్తు చేసుకోవాల్సిందే.  

10. రాము (చెల్లెలి కాపురం) 

అందాల నటుడు అంటేనే శోభన్ బాబు. మరి అలాంటి సోగ్గాడిని నల్లగా చూపించి హీరో అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. అప్పట్లో ఈయనకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉండేదట.