Presenting You The Aparichitulu Of Tollywood & We Are Like ‘Yevaru Mummy Veelu’

1. మాయాబజార్

వాళ్లే పాండవులు.. సినిమా కథ మొత్తం పాండవుల చుట్టే తిరుగుతుంది. చాలా సన్నివేశాల్లో వాళ్ల ప్రస్తావన వస్తుంది. కానీ సినిమాలో ఎక్కడా ఆ పాత్రలు కనిపించవు. చూస్తున్నంతసేపు వాళ్లు సినిమాలో ఉన్నట్లే అనిపిస్తుంది. 

2. బాహుబలి

బాహుబలి సినిమాలో మన అందరికి వచ్చిన ఒకే ఒక అనుమానం.. భల్లాలదేవుడి భార్య ఎవరని. భల్లాలదేవుడి పాత్ర సినిమాకి ఎంతో ముఖ్యం.. ఆ పాత్రకి ఒక కొడుకు కూడా ఉంటాడు. మరి అదేంటో అతని భార్య పాత్ర మాత్రం సినిమాలో పెట్టలేదు.  

3. బొమ్మరిల్లు

ఈ మూవీలో సురేఖావాణి ఎప్పుడూ తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరిగినా, ఏం చేసినా ముందు తన భర్తకి అన్నీ ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటుంది. ఆ భర్త క్యారెక్టర్ మాత్రం ఎవరో ఏంటో చూపించరు. గొంతు తప్ప ఆ పాత్రకి మనిషి లేడు. 

4. మహానటి

ఈ సినిమా మొత్తం సమంత ఒకరి గురించి వెతుకుతూ ఉంటుంది. అదే శంకరయ్య ఎవరో తెలుసుకోవాలని. అసలు శంకరయ్యకి, సావిత్రి గారికి సంబంధం ఏంటని. ఆ పాత్ర పేరు సినిమా మొత్తం ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది.  

5. సుందరకాండ

ఈ సినిమాలో ఒక గమ్మత్తైన పాత్ర ఉంటుంది. అదే వెంకీ వాళ్ల బామ్మ క్యారెక్టర్. అది కూడా గోడకు తగిలించిన ఓ ఫొటోలో. సినిమా మొత్తం బామ్మ నిర్మలమ్మ గారు ఫొటోలో కనిపిస్తారు, కానీ ప్రత్యక్షంగా ఎక్కడా ఆ పాత్ర ఉండదు. 

6. అరుంధతి

రుంధతిపై ప్రతీకారంతో తంత్ర విద్యలు నేర్చుకుని అఘోరలా మారి మళ్లీ గద్వాల్ గడ్డపై అడుగుపెడతాడు. అది కూడా సరిగ్గా అరుంధతి పెళ్లి చేసుకున్న రోజే. మరి అరుంధతి ఎవరిని చేసుకుంది.. ఆ మనిషి ఎవరు అనేది మాత్రం సినిమాలో చూపించలేదు.  

7. జాను

రామ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని జాను పదే పదే అడుగుతూ ఉంటుంది. తను పెళ్లి చేసుకుంది.. కానీ ఎవరిని చేసుకుందో మాత్రం చూపించరు. సినిమాకి మెయిన్ లీడ్ హీరోయిన్ భర్త పాత్ర మాత్రం ఇక్కడ మనకు అపరిచితుడిగానే ఉంచేశారు. 

8. అర్జున్ రెడ్డి

సినిమా చివర్లో ప్రీతి చెప్తుంది.. పెళ్లి చేసుకున్నా, కానీ వాడిని నా చిటికెన వేలు కూడా తాకనివ్వలేదని. సో.. ఇక్కడ కూడా ప్రీతి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరో మనకు చూపించలేదు.