టీజర్ తో ఆసక్తి పెంచేసిన ‘జాంబీ రెడ్డి’!

‘అ!’, ‘కల్కి’ వంటి చిత్రాల తరవాత ప్రశాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తోన్న మూడో సినిమా ‘జాంబీ రెడ్డి’. బాల‌న‌టుడిగా ప్రేక్షకులను అలరించి, ‘ఓ బేబీ’ చిత్రంలో టీనేజ్ కుర్రాడిగా కనిపించిన నటుడు తేజ స‌జ్జా ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసిన చిత్రబృందం.

”దైవం మనుష్య రూపేనా అన్నది ఇతిహాసం.. రాక్షస మనుష్య రూపేనా అన్నది ప్రస్తుతం.. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకేఒక పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం.. ఆ మేధాశక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే.. దైవం నేర్పే గుణపాఠం.. మనిషి ఉనికికే ప్రమాదం” అనే డైలాగ్స్ తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. చివర్లో హీరోయిన్ దక్ష గన్ , ఆనంది త్రిసూలం పట్టుకొని జాంబీలను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వడం..

అదే సమయంలో గేమ్ ఆన్ అనే టాటూని చూపిస్తూ రాడ్ పట్టుకొని హీరో తేజ కనిపించడం హైలైట్ గా నిలిచింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్న తొలి సినిమా ఇదే. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా.. అనిత్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి బాబా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.