‘జాంబీ రెడ్డి’ క్లోజింగ్ కలెక్షన్స్..!

‘యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మాతగా… ‘అ!’ ‘కల్కి’ వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. తేజ సజ్జ, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలయ్యింది. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో…. మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. అంతేకాదు విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ట్రేడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరింది.

ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 1.98 cr
సీడెడ్ 1.16 cr
ఉత్తరాంధ్ర 0.69 cr
ఈస్ట్ 0.51 cr
వెస్ట్ 0.39 cr
కృష్ణా 0.52 cr
గుంటూరు 0.52 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 6.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.33 cr
టోటల్ వరల్డ్ వైడ్ 6.65 cr (షేర్)

‘జాంబీ రెడ్డి’ చిత్రానికి 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. 5 రోజుల్లోనే ఆ టార్గెట్ ను కంప్లీట్ చేసింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 6.65 కోట్ల షేర్ ను వసూల్ చేసి సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరింది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.