పవన్ సినిమాకి క్రేజీ డీల్!

రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి నుండి కూడా ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో ఉంది. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు అంటే.. డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి రూ.30 కోట్లకు విక్రయించారు. ఈ హక్కులను జీటీవీ తీసుకుంది. ఇవి కాకుండా హిందీ డబ్బింగ్ హక్కులు ఉన్నాయి. అయితే ఇది ‘పింక్’ సినిమాకి రీమేక్ కావడంతో హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంతమేరకు పలుకుతాయనేది చెప్పలేని పరిస్థితి. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ లాంటి భారీ సినిమాల హక్కులు తీసుకున్న దుబాయ్ ఫారస్ సంస్థ పవన్ సినిమా హక్కులను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకుందని చెబుతున్నారు కానీ అసలు రేటు ఇంకా తెలియాల్సివుంది. అలానే పవన్-రానా సినిమా బిజినెస్ కూడా జోరుగానే జరుగుతుంది. రీఎంట్రీలో పవన్ నటిస్తోన్న సినిమాలకు క్రేజ్ ఉండడంతో భారీ మొత్తాలను చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకుంటున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.