‘అల వైకుంఠపురములో’.. అల కుదరదట..!

కొన్ని ప్రమోషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. దీనికి సోషల్ మీడియా నెటిజన్ల కామెంట్ లు సైతం చాలా ఫన్నీగా ఉంటుంటాయి. ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రమోషన్ లకి సైతం… ప్రమోషన్ లు చేస్తున్నారా.. బెదిరిస్తున్నారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తుండడం విశేషం.

you-wont-see-ala-vaikunthapuramuloo-movie-in-amazon-or-netflix

అసలు విషయం ఏంటంటే… ‘అల వైకుంఠపురములో’ సినిమా యూ.ఎస్ డిస్ట్రిబ్యూషన్ ‘బ్లూ స్కై సినిమాస్’ సంస్థ చేస్తుంది.ఇక పోస్టర్ లలో ఈ చిత్రాన్ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ చూడలేరు అంటూ పేర్కొన్నారు. ‘అంటే కచ్చితంగా థియేటర్ కు వచ్చే చూడాలి’.. ఇంట్లో చూడటం కుదరదు అని వారు పరోక్షంగా చెప్పినట్టు ఉంది. అందుకే … ‘ప్రమోషన్ చేస్తున్నారా.. లేక బెదిరిస్తున్నారా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.