మరో పాన్ ఇండియా కథ ఓకే చేసిన ‘కేజీఎఫ్’ స్టార్!

‘కేజీఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు హీరో యష్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన యష్ గురించి అప్పటివరకు బయట ఇండస్ట్రీ ప్రజలను పెద్దగా తెలియదు. కానీ ‘కేజీఎఫ్’ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా అతడికి క్రేజ్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం యష్ ‘కేజీఎఫ్2’ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత యష్ తో కలిసి పని చేయడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తిచూపుతున్నారు.

కానీ యష్ మాత్రం కన్నడ యంగ్ డైరెక్టర్ నార్తన్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రూపొందిస్తారని సమాచారం. తాజాగా ఈ హీరో మరో పాన్ ఇండియా సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలుగులో బాలయ్య హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించిన నిర్మాత విష్ణు ఇందూరి.. యష్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో యష్ నాలుగైదు సార్లు కలిశారు.

తాజాగా ఈ హీరో విష్ణు ఇందూరి ప్రొడక్షన్ లో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పుడు యష్ కి సరిపడే కథ కోసం చూస్తున్నారు విష్ణు ఇందూరి. ఈ క్రమంలో బాలీవుడ్, టాలీవుడ్ దర్శకులతో పాటు కన్నడ దర్శకులను కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. యష్ కి సూటయ్యే కథ ఎవరు చెబితే వారితో సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ముందుగా యష్.. దర్శకుడు నార్తన్ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత విష్ణు ఇందూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.