బ్రూట్‌ ఫోర్స్‌ అటాక్‌ గురించి తెలుసా?

ఇంటర్నెట్‌ సందు గొందుల్లో దాక్కుని ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న హ్యాకర్స్‌ గురించి చాలా వినుంటారు. ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, ఎప్పుడు చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు ఇవన్నీ తెలియదు కానీ… జీవితాల్ని అతలాకుతలం చేసేస్తుంటారు. సిస్టమ్స్‌, మొబైల్స్‌ హ్యాక్‌ చేసి వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తుంటారు. ఆ తర్వాత ఇంకేముంది దాంతో బ్లాక్‌ మెయిల్‌ చేసి, డబ్బులు గుంజేస్తుంటారు. ఇదంతా మనకు తెలిసినదే. ఇలాంటి పరిస్థితే ఓ నలుగురు స్నేహితులకు ఎదురైతే… అదే WWW.

క్రిస్టీ, విశ్వ, సదా, అష్రఫ్‌ అనే నలుగురు స్నేహితులు సరదగా వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా క్రిస్టీ ఫ్రెండ్‌తో విశ్వ లవ్‌లో పడతాడు. కొద్ది రోజులు ఆ ట్రాక్‌ రన్‌ అవుతుండగా.. ఎవరో అగంతుకుడు వాళ్ల సిస్టమ్స్‌ను హ్యాక్‌ చేస్తాడు. అసలు ఎవరతను, ఎందుకు హ్యాక్‌ చేశాడు, ఆ తర్వాత ఏం చేశాడనేదే టీజర్‌.. టీజరే కాదు సినిమా కూడా ఇంతేలా కనిపిస్తోంది. దీనిని బ్రూట్‌ ఫోర్స్‌ అష్రఫ్‌ చెబుతాడు. అసలు ఏంటా ఎటాక్‌ అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌.

థ్రిల్లర్‌ సినిమాల నిపుణుడు కె.వి.గుహన్‌ నుంచి వస్తోన్న మరో వండర్‌గా ఈ సినిమా కనిపిస్తోంది. ఇటీవల కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ‘118’ రూపొందించిన దర్శకుడీయన. ఈసారి సైబర్‌క్రైమ్‌ను మెయిన్‌ పాయింట్‌గా తీసుకున్నాడు. కాసేపు కనిపించిన టీజర్‌లో అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌, దివ్య, ప్రియదర్శి, సత్యం రాజేశ్‌, వైవా హర్ష ఆకట్టుకున్నారు. అన్నట్లు ఈ టీజర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు లాంచ్‌ చేశాడు. టీజర్‌ చూస్తే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. డేట్‌ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీకూ చెప్పలేం.


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.