టీజర్ తో పోలిస్తే ట్రైలర్ కాస్త బెటర్..!

‘డియర్ కామ్రేడ్’ వంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నుండీ వస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న వ్యాలెంటైన్స్ డే కానుకగా విడుదల కాబోతుంది. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్. రామారావు అలాగే కె.ఏ. వల్లభ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేష్ వంటి క్రేజీ భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ముందుగా విడుదల చేసిన టీజర్ అంత ఆకట్టుకోనప్పటికీ.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం పర్వాలేదనిపించిందనే చెప్పాలి.

World Famous Lover Trailer Review1

‘ఈ ప్రపంచంలో నిస్వార్ధమైంది ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. అయితే ‘ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు’ అనే డైలాగ్ తో అసలు కథ ఏంటనేది హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం నలుగురు హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలతో నింపినప్పటికీ.. బలమైన ఎమోషన్ కూడా కథలో ఉంటుందేమో అని ఫీలింగ్ ను కలిగిస్తుంది. గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే జయకృష్ణ గుమ్మడి అందించిన విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ పర్వాలేదనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Share.