‘వరల్డ్.. అర్జున్.. కామ్రేడ్’ లా ఉంది..!

విజయ్ దేవరకొండ హీరోగా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్లా వంటి మరో ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఏ. వల్లభ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు. ఆ టీజర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి.

World Famous Lover Movie Teaser

‘ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది..’ అని హీరోయిన్ రాశీ ఖన్నా చెబుతోన్న డైలాగ్ తో వరల్డ్ ఫేమస్ టీజర్ మొదలైంది. ఓ కార్మికుడు గా.. ప్రేమికుడు గా… భర్తగా.. ప్లే బాయ్ గా.. ఇలా రకరకాల షేడ్స్ లో హీరో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ‘అర్జున్ రెడ్డి’ ‘డియర్ కామ్రేడ్’ ఫ్లేవర్ ఈ టీజర్లో కూడా కనిపించింది. విజయ్, రాశీ ఖన్నా ల మధ్య వచ్చే లిప్ లాక్ హైలెట్ అని చెప్పాలి. టీజర్ పెద్దగా ఆకట్టుకునే విధంగా అయితే ఏమీ అనిపించలేదు.. కానీ విజయ్ దేవరకొండ కోసం ఓ లుక్కెయ్యండి.


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.