ఆ వరల్డ్ ఫేమస్ డేకి వస్తానంటున్న విజయ్ దేవరకొండ!

“డియర్ కామ్రేడ్” డిజాస్టర్ అనంతరం విజయ్ దేవరకొండ కాస్త నెమ్మదించాడు. అందుకే తన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” రిలీజ్ విషయంలో ఎలాంటి కంగారుపడడం లేదు. నిజానికి ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయడం విజయ్ కి అలవాటు. అలాగే.. ఒక హిట్ సినిమా తర్వాత ఒక ఫ్లాప్ అందుకోవడం, ఒక ఫ్లాప్ తర్వాత మరో సూపర్ హిట్ సొంతం చేసుకోవడం విజయ్ కి అలవాటే. అందుకే.. “డియర్ కామ్రేడ్” ఫ్లాప్ కాబట్టి నెక్స్ట్ సినిమా “వరల్డ్ ఫేమస్ లవర్” పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు విజయ్ ఫ్యాన్స్ అందరూ.

vijay-deverakondas-worldfamouslover-movie-first-look

అందుకే.. విజయ్ కూడా డిసెంబర్ లో తన సినిమాను విడుదల చేద్దామని ముందు అనుకొన్నప్పటికీ.. లవ్ సినిమా కాబట్టి ఫిబ్రవరి 14 సరైన డేట్ అని ఫిక్స్ అయ్యాడట. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తుండగా.. కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.