తన తప్పులేకపోయినా.. బాధ్యతతో ముందుకొచ్చి స్పందించింది!

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన ‘అయోగ్య’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది రాశీఖన్నా. తెలుగులో సూపర్ హిట్టైన ‘టెంపర్’ చిత్రానికి ఇది రీమేక్ అని అందరికీ తెలిసిన సంగతే. అనేక అడ్డంకుల్ని ఎదుర్కొని మే11 న ఈ చిత్రం విడుదలైంది. విశాల్ నటన అద్బుతంగా ఉందని కోలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసించారు. హీరోయిన్ రాశీ ఖన్నా నటన కూడా బాగుందని కూడా వారు పేర్కొన్నారు. వెంకట్ మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్ లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదంట.

raashi-khanna-says-sorry1

ఈ విషయం పై హీరోయిన్ రాశీఖన్నాకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా ఎస్.ఆర్ మనసు నొచ్చుకోవడంతో ఆమె బాధను వ్యక్తపరిచింది. డ్రైవర్లకు, పెయింటర్లకు, మెస్ వారికి, సౌండ్ ఇంజనీర్లకు అందరికీ ఎండ్ టైటిల్స్ వేసేప్పుడు క్రెడిట్స్ ఇచ్చారు. కానీ మా వాయిస్ ఆర్టిస్టులను మాత్రం వదిలేయడం బాధ కలిగిస్తోంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన రాశీఖన్నా వెంటనే స్పందించింది. తన తప్పు ఏమాత్రం లేకపోయినా ఈ జరిగిన విషయానికి రవీనా కు సారీ చెబుతూ… ‘నన్ను స్క్రీన్ పై మరింత ఎలివేట్ చేయడానికి అందమైన గొంతును ఇచ్చిన మీకు చాలా కృతజ్ఞతలు’ అంటూ ఆమె పేర్కొంది. ఏమైనా తన తప్పు లేకపోయినా ఎంతో బాద్యతతో ఇలా ముందుకొచ్చి స్పందించిన రాశీఖన్నాను సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు.

Share.