బిగ్ బాస్ 4: రీ యూనియన్ ఉందా..? లేదా..?

బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ ని డిసైడ్ చేసే టైమ్ వచ్చేసింది. డిసెంబర్ 20వ తేదిన గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. మరి ఈ ఫినాలేకి ఎవరు రాబోతున్నారు..? ఈసారి చీఫ్ గెస్ట్ ఎవరు అన్నదానిపైన చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన వాళ్లు తిరిగి హౌస్ లోకి వస్తారా..? రారా ? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి ప్రతిసీజన్ లో రీ యూనియన్ పార్టీ అనేది ఉంటుంది. ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన వాళ్లు లాస్ట్ వీక్ లాస్ట్ డే వరకూ వచ్చి వారితో పార్టీలో పాల్గొంటారు. అయితే, ఈసారి కోవిడ్ నిబంధనలు ఉన్న కారణంగా కుటుంబసభ్యులనే లోపలకి పంపించలేదు. మరి ఇప్పుడు రీ యూనియన్ పార్టీ అనేది పెడతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. సోష‌ల్ మీడియాలో మాత్రం కంటెస్టెంట్ల రీయూనియ‌న్ 17, 18వ తేదీల్లో ఉండ‌బోతుంద‌ని చెప్తున్నారు.

అంతేకాదు, ఈసారి గ్రాండ్ ఫినాలే లో ఎలిమినేట్ అయ్యిపోయి వెళ్లిన పార్టిసిపెంట్స్ తో స్పెషల్ డ్యాన్స్ లని స్టేజ్ పైన ప్లాన్ చేసినట్లుగా చెప్తున్నారు. దీనికోసం సెలబ్రిటీలని – హారోయిన్స్ ని కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. స్టేజ్ పైన షోని 3గంటల పాటు నాన్ స్టాప్ గా ప్లాన్ చేసినట్లుగా సమాచారం. మరి ఈసారి విన్నర్ ని డిసైడ్ చేసే వీక్ లో ట్విస్ట్ ఏముండబోతోంది.? ఈసారి షోని ఎలా ప్లాన్ చేశారు అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అదీ విషయం.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.