‘లూసిఫర్’ ‘వేదాలం’ తో పాటు మరో రీమేక్ కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక మెగాస్టార్.. మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. అనిల్ సుంకర ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు. ఇది పూర్తయిన తరువాత వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ లో కూడా చిరు నటించబోతున్నారు.

ఇప్పుడు మరో రీమేక్ కు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. తమిళంలో సూపర్ హిట్టైన ‘ఎన్నై అరిందాల్’ అనే చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని చిరు భావిస్తున్నారట. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ‘ఎంతవాడు గాని’ పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యింది. అయితే ఇక్కడి ప్రేక్షకులు పెద్దగా ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. కానీ బుల్లితెర పై మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

మరి మెగాస్టార్ ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తే పట్టించుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న? చిరు ఇమేజ్ కు తగినట్టు కీలక మార్పులు చేసి రీమేక్ చేస్తే కనుక కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరి ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఎవరు నిర్మిస్తారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.