బిగ్ బాస్ 4: విన్నర్ ఎవరో తెలిసిపోతోందా..?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రీయూనియన్ పార్టీకి సర్వం సిద్ధం అయ్యింది. అయితే, బిగ్ బాస్ హౌస్ లోకి వీళ్లని పంపించకుండా గ్లాస్ డోర్స్ కే పరిమితం చేశాడు బిగ్ బాస్. హౌస్ లోపల వాళ్లు పార్టీ చేసుకుంటుంటే, హౌస్ బయట వీళ్లు గెట్ టు గెదర్ అయ్యి ఫన్ చేయబోతున్నారు. ఇక పాత హౌస్ మేట్స్ ని కలిసిన ఉత్సాహంలో ఇప్పుడు మిగిలిన 5గురు హౌస్ మేట్స్ కూడా మునిగిపోనున్నారు.

అయితే, ఇక్కడ వీళ్ల మద్యలో ఎలాంటి మాటలు కలుస్తాయి. మనకి టెలికాస్ట్ చేయని సీన్స్ లో వాళ్లు ఏం మాట్లాడుకుంటారు అనేది ఆసక్తికరం. లాస్ట్ సీజన్స్ లో ఇలాగే రీ యూనియన్ పార్టీస్ అయినపుడు విన్నర్ ని ముందుగానే టాప్ – 5 మెంబర్స్ కి తెలిసేలా మాట్లాడేసుకున్నారు. దీంతో హౌస్ మేట్స్ లో ఉత్సాహం అనేది తగ్గిపోయింది. మరి ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ రీ యూనియన్ అయ్యి, విన్నర్ ఎవరు అనేది కళ్లతో సైగలు చేసినా కూడా ఇప్పుడు హౌస్ మేట్స్ కి అర్ధమైపోతుంది.

అంతేకాదు, ఇక్కడ విన్నర్ – రన్నర్ అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కన్ఫార్మ్ గా కూడా చెప్పేస్తున్నారు కాబట్టి, ఈ సీక్రెట్ ని ముందుగానే హౌస్ మేట్స్ రివీల్ చేసేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సుజాత, మోనాల్, మెహబూబ్, లాస్య, ఇలా అందరూ కలిస్తే ఖచ్చితంగా ఈ పాయింట్ ఎక్కడో ఒక దగ్గర రివీల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ముందుగానే విన్నర్ ఎవరో తెలిసిపోతే హౌస్ మేట్స్ కి ఫైనల్ స్టేజ్ పైన కిక్ పోతుందనే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. అదీ మేటర్.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Share.