ఆచార్య మరో మగధీర అవుతుందా..?

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాల ద్వారా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రెండో సినిమా మగధీరతో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు హీరోగా సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్ ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే రంగస్థలం లాంటి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

అయితే రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా ఆ సినిమాల్లో చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలు ఎక్కువగా లేవు. అయితే తండ్రి చిరంజీవితో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలన్న చరణ్ కోరిక ఆచార్య సినిమాతో తీరింది.

Ram Charan in Acharya Movie Will be or not1

దాదాపు 40 నిమిషాల పాటు ఆచార్య సినిమాలో చరణ్ కనిపిస్తారని సమాచారం. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని సమాచారం. ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 42 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి.

ఇతర ఏరియాల నుంచి ఆచార్య సినిమాకు భారీగా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాల్లో మగధీర హిట్ అయితే బ్రూస్ లీ ఫ్లాప్ అయింది. దీంతో చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మరో మగధీర అవుతుందా..? లేక బ్రూస్ లీ అవుతుందా..? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.