‘వైల్డ్ డాగ్’ ట్రైలర్: యాక్షన్ స్టోరీతో నాగ్.. హిట్ కొట్టేలా ఉన్నాడు!

‘మన్మథుడు 2’ తరువాత నాగార్జున నటిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిసోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో పని చేసే విజయ్‌వర్మ అనే ఏజెంట్‌గా ఆయన నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిచారని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతోంది.

హైదరాబాద్ లో జరిగిన గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ తో ట్రైలర్ ని మొదలుపెట్టారు. బాంబ్ బ్లాస్ట్ చేసిన ఉగ్రవాదులను పట్టుకునే బాధత్యను ప్రభుత్వం.. NIA (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ)కు అప్పగిస్తుంది. ఈ ఏజెన్సీలో పని చేసే విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ ఈ కేసుని లీడ్ చేస్తారు. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారించే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. ”ఒకడు మన దేశంలో వందల మంది అమాయకులను చంపి.. మీరేమీ చేయలేరంటే.. ఐ యామ్ నాట్ ఓకే విత్ దట్” అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది.

అలానే టీజర్ చివర్లో.. ”ఏం చేస్తార్రా.. ఇండియాకు తీసుకెళ్లి..? వారానికి రెండు సార్లు బిరియాని జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ.. కుక్కల్లా కాపలాగా ఉంటారు” అంటూ విలన్ పలికిన డైలాగ్ దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుని ఎండగట్టేలా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తో నింపేశారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో దియా మీర్జా హీరోయిన్ గా కనిపించనుంది. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.