బిగ్ బాస్ 4: రీయూనియన్ లో ఇద్దరు మిస్సింగ్..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సంవత్సరం ఫినాలేకి ముందు రీయూనియన్ పార్టీ జరుగుతున్నట్లుగానే ఈసంవత్సరం కూడా ప్లాన్ చేశారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా మిర్రర్ డోర్ అడ్డుపెట్టి హౌస్ మేట్స్ ని పలకరిస్తున్నారు. ఇందులో భాగంగా అందరూ ఒకేసారి రాకుండా, ఇద్దరిద్దరు చొప్పున హౌస్ లోకి ఎంట్రి ఇస్తున్నారు. ఫస్ట్ మోనాల్ గజ్జర్ మార్నింగ్ అందర్నీ సోలోగా పలకరిస్తే, ఆ తర్వాత కళ్యాణి, లాస్యలు కాసేపు వచ్చి హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు.

ఇక కుమార్ సాయి, స్వాతిలు కంపుల్ ఎంట్రీ అంటూ కాసేపు డ్రామా చేశారు. హౌస్ మేట్స్ ని ఆటపట్టిస్తూ అల్లరిచేశారు. కుమార్ సాయి మరోసారి తన కరివేపాకు కౌంటర్ ని గుర్తుచేశాడు. అంతేకాదు, కరాటే కళ్యాణి పాట పాడుతూ అఖిలే విన్నర్ అయినా అంటూ హింట్ ఇచ్చింది. కానీ, అఖిల్ డేంజర్ జోన్ లో లీస్ట్ లో ఉన్నాడని మాత్రం తనకి తెలియదు.

ఇక శనివారం ఎపిసోడ్ లో చూసినట్లయితే నోయల్, మెహబూబ్, దివి, సుజాత, గంగవ్వ , అవినాష్ వస్తున్నట్లుగా చూపించారు. కానీ ఎక్కడా కూడా ప్రోమోలో సూర్యకిరణ్, అమ్మరాజశేఖర్, ఇంకా దేవిలు కనిపించలేదు. సూర్యకిరణ్ హౌస్ లోకి వచ్చినట్లుగానే సమాచారం తెలుస్తోంది. అయితే, అమ్మరాజశేఖర్ ఇంకా దేవిలు మాత్రం రీయూనియన్ కి కొన్ని కారణాలవల్ల రాలేకపోయినట్లుగా సమాచారం. మరి ఫైనల్స్ లో వస్తారా రారా అనేది మాత్రం ఆసక్తికరం.

అమ్మరాజశేఖర్ చెన్నైలో షూటింగ్ బిజీ ఉండటం వల్ల రాలేదని, అలాగే దేవికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, గ్రాండ్ ఫినాలేకి మాత్రం ఖచ్చితంగా వస్తారనే అనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

Share.