బాలీవుడ్లోనే కాదు ప్రభాస్ తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయాలి

“సాహో” ఇది తెలుగు వారి స్థాయిని బాలీవుడ్ కి మరోసారి ప్రూవ్ చేసే సినిమా అని చెప్పి చెప్పి తెలుగు మీడియా గొంతు అరిగిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందినప్పటికీ.. తెలుగు సినిమాగానే అందరికీ “సాహో” తెలుసు. కానీ.. ప్రభాస్ & టీం “సాహో” చిత్రాన్ని తెలుగు, తమిళ, మలాయాళ భాషల్లో కంటే హిందీలోనే ఎక్కువగా ప్రమోట్ చేస్తుండడం మాత్రం మిగతా భాషల ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. హిందీలో ప్రభాస్ ఆల్రెడీ పాపులర్ మీడియా హౌస్ లకు, కొన్ని యూట్యూబ్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాక.. రియాలిటీ షోస్ లో కూడా పాల్గొన్నాడు.

prabhas-new-saaho-poster-is-in-trending-now

కానీ.. తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పితే.. ఇక్కడ వీడియో ఇంటర్వ్యూలు కానీ.. ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ లేదు. మరి తెలుగు ప్రేక్షకుల కోసం రిలీజ్ కి ముందు తెలుగులో కూడా కాస్త ఆసక్తికరమైన లేదా ఫన్నీ ఇంటర్వ్యూలు ప్రభాస్ & టీం ప్లాన్ చేస్తే బాగుండు. మరి ఈ విషయాన్ని ప్రభాస్ & టీం సీరియస్ గా తీసుకోంటారో లేదో.

Share.