చీప్ స్టార్ అని తిట్టినా పట్టించుకొని రవితేజ

ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో మంచైనా, చెడైనా తొందరగా పాకిపోతుంది. చెడు ఇంకాస్త వేగంగా పాకుతుంది అనుకోండి. అయితే.. గత కొన్నిరోజులుగా రవితేజ చీప్ స్టార్ అనే స్టేట్మెంట్స్, వార్తలు కాస్త గట్టిగా హల్ చల్ చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ రవితేజ ఈ విషయాలకి రెస్పాండ్ అవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. రవితేజ తీరే అంత. తన తమ్ముడి మరణం విషయంలో వచ్చిన ట్రోలింగ్స్ కి కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు రవితేజ. సాక్షి పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆన్సర్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు. అయితే.. ఇప్పుడు అజయ్ భూపతి “మహా సముద్రం” విషయంలో రవితేజ సైలెంట్ గా ఉండడం మాత్రం ఎందుకో మంచిది అనిపించడం లేదు.

director-ajay-bhupathi-shocking-comments-on-ravi-teja1

రవితేజ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తాడని మంచి పేరు ఉంది. కానీ చీప్ స్టార్ ట్వీట్ పుణ్యమా అని రవితేజకు రెమ్యూనరేషన్ మాత్రమే ఇంపార్టెంట్ అని కొత్త స్టేట్ మెంట్స్ పాస్ అవుతున్నాయి. మరి ఈ తరుణంలో రవితేజ రెస్పాండ్ అవ్వాల్సిందే. లేక “డిస్కో రాజా” ప్రమోషన్స్ లో భాగంగా ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. కానీ.. అప్పటికి జరగాల్సినదంతా జరిగిపోతుంది.

Share.