అలా అయితే మహేష్ మూవీకి కూడా పాన్ ఇండియా కళ వచ్చేసినట్టే..!

ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చెయ్యడానికి కుతూహలం చూపిస్తున్నారు. ఒక భాషలో కాకపోయినా మరోభాషలో అయినా సినిమా హిట్ అయితే సేఫ్ అయిపోవచ్చు అనేది వారి అభిప్రాయం కావచ్చు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చరణ్ ఇలా స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.అందుకోసం తమ సినిమాల్లో పర భాషా నటుల్ని కూడా ఎంపిక చేసుకుంటున్నారు.

అయితే మహేష్ బాబు మాత్రం పాన్ ఇండియా సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో చేస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం పాన్ ఇండియా చిత్రమని నిర్మాతలు కానీ మహేష్ కానీ అనౌన్స్ చెయ్యలేదు. ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ సంస్థలతో పాటు ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈమెకు తమిళ్ లో కూడా మార్కెట్ ఉంది..

Mahesh Babu's Sarkaru Vaari Paata Movie First Look Review1

మహేష్ కు కూడా అక్కడ మార్కెట్ ఉంది. తమన్ సంగీతం అందించనున్నాడు.. ఇతను కూడా కాలీవుడ్, బాలీవుడ్ లో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. పి.ఎస్. వినోద్ కెమెరామెన్.. ఇతను కూడా ఫేమౌసే.! అంతా బానే ఉంది కానీ విలన్ సంగతి తేలడం లేదు. అరవింద్‌ స్వామి, ఉపేంద్ర, సుదీప్‌ వంటి స్టార్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఒకర్ని కచ్చితంగా ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. అది నిజమే అయితే మహేష్ సినిమాకి పాన్ ఇండియా కళ పుష్కలంగా ఉన్నట్టే అని చెప్పాలి. మరి ‘సర్కారు వారి పాట’ టీం ప్లాన్ ఎలా ఉందో?

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Share.