‘బిగ్ బాస్ 3’ : హౌస్ నుండీ ఆమె ఎలిమినేట్ అయ్యిందట..!

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కో హౌస్ మేట్ కు ఒకరి గురించి మరొకరు ఏం మాట్లాడుకున్నారు అనేది.. వీడియోలు ద్వారా చూపించి వారిలో ఉన్న కోపాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేసాడు ‘బిగ్ బాస్’. ఇక ఇదే క్రమంలో కంటెస్టెంట్ హిమజకు ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు. హౌస్ లో ఆమెని విలన్ గా మారమని చెప్పి అల్లర్లు పెంచే ప్రయత్నం చేశాడు. ఆ టాస్క్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తే ఆమెకి ‘ఇమ్యూనిటీ’ (అంటే ఓ వారం నామినేషన్ నుండీ తప్పించుకోవచ్చు) లభిస్తుందని చెప్పాడు. కానీ ఆమె సరిగ్గా సీక్రెట్ టాస్క్ ను పూర్తి చేయలేకపోయింది.

who-is-going-to-eliminate-this-weekend-from-bigg-boss3

ఇదిలా ఉండగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ వారం నామినేషన్స్ లో బాబా భాస్కర్, రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి, ఆషూ రెడ్డి, మహేష్ విట్టా, హిమజ, శివ జ్యోతి వంటి వారు ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం హౌస్ నుండీ ఆషూ రెడ్డి ఎలిమినేట్ అవ్వబోతుందని సమాచారం. జూనియర్ సమంతలా ‘టిక్ టాక్’ లు చేసే అషూ రెడ్డి… హౌస్ లో మాత్రం అంత యాక్టివ్ గా టాస్క్ లు చేయలేకపోతోందని కామెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం ఈమెకు తక్కువ ఓట్లు పడ్డాయట. కాబట్టి ఈమెనే ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Share.