ఆ ట్యాలెంటెడ్ డైరెక్టర్ జాడ ఎక్కడ?

ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్టర్లు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే పోటీ రంగం కాబట్టి.. హిట్ ఉంటేనే హీరోల నుండీ తదుపరి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇక ‘ఆది’ లో ఎం.ఎస్.నారాయణ చెప్పినట్టు ‘అస్సామ్’ అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడేమో అనిపిస్తుంది దర్శకుడు మేర్లపాక గాంధీ. సందీప్ కిషన్ తో ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ వంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల్ని అలరించిన ఈ దర్శకుడు… మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని మీడియం హీరోలను ఆకర్షించాడు.

Merlapaka-Gandhi-2

అటు తరువాత శర్వానంద్ తో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాన్ని కూడా చేసి.. సూపర్ హిట్ అందుకున్నాడు. ‘రెండు హిట్లున్నాయి కాబట్టి ఈసారి కచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడు.. అందులోనూ డబుల్ హ్యాట్రిక్ లు కొట్టిన ఓ హీరోతో సినిమా చేస్తున్నాడు’ అని అనుకుంటే ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో నానికి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఆ చిత్రం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లోపం వల్ల సినిమా ప్లాప్ అయ్యిందని ఫిలిం విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ప్లాప్ తర్వాత ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ మరే హీరోతోనూ సినిమా అనౌన్స్ చేయలేదు. సాధారణంగా గాంధీ సినిమాకి.. సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటాడు అని అందరూ అంటుంటారు. మొదటి చిత్రం 2013 లో చేస్తే రెండో చిత్రం 2016 లో చేసాడు. ఆ తరువాత మళ్ళీ 2018 వరకూ సినిమా చేయలేదు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.