‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ పై సరికొత్త జోకులు..!

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టీజర్ కొద్ది సేపటిక్రితమే విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్టు గానే ఈ చిత్రాన్ని పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించినట్టు తెలుస్తుంది. చాన్నాళ్ళ తరువాత మహేష్ ను ఫుల్ మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసాడు. ఇప్పుడు ఈ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

Mahesh

అయితే ఈ టీజర్ లో దాదాపు నటీనటులు అందరూ కనిపించారు. రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విజయశాంతి, ప్రకాష్ రాజ్ తో అజయ్ వంటి వాళ్ళు కూడా కనిపించారు. కానీ హీరోయిన్ రష్మిక మందన మాత్రం కనిపించలేదు. బహుశా ‘మాస్ ట్రైలర్’ అన్నారు కాబట్టి ఆమెను పక్కన పెట్టి ఉండొచ్చు. ఈ విషయంలో ఆమె అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంతో సీనియర్ కమెడియన్, మరియు బ్లాక్ బస్టర్ నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ లో ఆయన కూడా కనబడలేదు. దీంతో కొంతమంది ‘రష్మిక లేకపోయినా పర్వాలేదు.. మా బండ్లన్న ఎక్కడ’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండడం విశేషం.


“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.