చిరు, నాగ్, వెంకీ అప్డేట్ అయ్యారు.. బాలయ్య మాత్రం.?

ఇది సోషల్ మీడియా యుగం. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా మాధ్యమాలను వాడుతున్నారు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వార స్టార్స్ తమ భావాలు, వ్యక్తిగత విషయాలు, సినిమా అప్డేట్స్ పంచుకుంటూ ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఒక స్టార్ అభిమానులకు చేరువకావడానికి ఇది ప్రభావవంతమైన మాధ్యమం. ఇక హీరో స్టార్ డమ్ సోషల్ మాధ్యమాలలో తనకున్న ఫాలోవర్స్ ని బట్టి తెలుస్తుంది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి.

సీనియర్ హీరోలలో కింగ్ నాగార్జున ఎప్పటి నుండో ట్విట్టర్ అకౌంట్ వాడుతుండగా, ఇటీవలే చిరంజీవి, వెంకటేష్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మరి బాలయ్య బాబుకి ఏమైంది అనేది ఎవరికీ అంతుబట్టని విషయం. బాలయ్య బాబు స్టార్ హీరోలలో ఒకరు. అలాగే నందమూరి అభిమానుల మొదటి ఛాయిస్. ఆయన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే లక్షలాది అభిమానులు ఆయన్ని ఫాలో అవడం ఖాయం. మరి ఇంతటి అభిమాన గణం ఉండి ఆయన సోషల్ మీడియాలోకి ఎందుకు ఎంటర్ కావడం లేదని అందరి అనుమానం.

When will Balayya Babu Update1

బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరియు నందమూరి అభిమానులు ఆయన సోషల్ మీడియాలోకి ఎంటర్ కావాలని కోరుంటున్నారు. ఆయన మాత్రం అటు వైపుగా అడుగులు వేయడం లేదు. ఇక నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్, కళ్యాణ్ సోషల్ మీడియా అకౌంట్స్ కలిగివున్నారు. ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. మరి ఇప్పటికైనా బాలయ్య అభిమానుల బాధ అర్ధం చేసుకొని సోషల్ మీడియా ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.