పరుశురామ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి..!

గీత గోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్ అండ్ టీమ్ కలిసి చేస్తున్న సినిమా సర్కార్ వారి పాట. ఎప్పట్నుంచో మహేష్ బాబు అభిమానిగా ఇండస్ట్రీలో ఉంటూ ఇన్నాళ్లకి మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ ఆ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు, ఒక్కడు సినిమా చూసిన తర్వాత మహేష్ బాబుతో ఒక్కసినిమా అయినా చేయాలని ఇండస్ట్రీకి వచ్చానని డైరెక్టర్ పరుశురామ్ చాలా సందర్భాల్లో అన్నాడు కూడా.

అందుకే, ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ పై మరింత హార్డ్ వర్క్ చేసి షూటింగ్ కి రెడీ అయ్యాడు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ చేస్కుంటున్న ఈ సినిమా నెక్ట్స్ హైదరాబాద్ లో కీలకమైన సన్నివేశాలని తీసేందుకు రెడీ అయ్యింది. ఈ టైమ్ లో పరుశురామ్ ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా ముందుగానే ఊహించి మేకింగ్ షాట్స్ లో మహేష్ చెప్పే డైలాగ్స్, అలాగే మహేష్ బాబు స్పాట్ లో ఎలా ఉంటారు అనేదాన్ని షూటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

దీన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ గా సినిమా కంటే ముందే రిలీజ్ చేస్తారట. ఇక ఫ్యాన్స్ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సినిమాని తెరకెక్కించేందుకు చూస్తున్నాడని అంటున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలపై ఈ సినిమా కథాంశం ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పక్కా మాస్ లుక్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు. అదీ విషయం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.