బ్యాంకబుల్ హీరో నుంచి.. రిస్కీ హీరో అయిపోయిన నేచురల్ స్టార్

“మిడిల్ క్లాస్ అబ్బాయి” ముందు వరకూ నాని అంటే బ్యాంకబుల్ హీరో అనే పేరు ఉండేది. ఆయనతో ఒక 25 కోట్లలో సినిమా తీస్తే.. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయ్యే రేంజ్ లాభాలు వచ్చేవి. అందులోనూ నాని ఏడాదికి ఈజీగా ఒక మూడు సినిమా చేయడం.. మూడూ కమర్షియల్ హిట్స్ గా మారడంతో నానిని నేచురల్ స్టార్ చేసేసింది ఇండస్ట్రీ. ఇక నానికి ఒక మంచి సూపర్ హిట్ పడితే లాభాలు ఆకాశాన్నంటుతాయని “భలే భలే మగాడివోయ్” చిత్రం నిరూపించింది. దాంతో నానితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు.

nanis-gang-leader-movie-review5

అప్పటికి వరుసబెట్టి 9 సూపర్ హిట్స్ కొట్టి ఉన్న నానికి “కృష్ణార్జున యుద్ధం” చిత్రంతో మొదటి దెబ్బ తగిలింది. ఆ సినిమా కనీస స్థాయి కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన దేవదాస్ కూడా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. “జెర్సీ”కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఇక రీసెంట్ సినిమా “గ్యాంగ్ లీడర్”కు టాక్ తోపాటు కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. దాంతో నాని రేంజ్ ఎందుకు తగ్గిందో అర్ధం కాక నాని & కో తోపాటు నిర్మాతలు కూడా మధనపడుతున్నారు. అందుకే.. నానికి అర్జెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.