తనపై వస్తున్న రూమర్లపై స్పందించిన పూజా హెగ్డే!

“మహర్షి” ప్రీరిలీజ్ నుంచి డైరెక్ట్ గా ముంబై వెళ్తున్న పూజా హెగ్డేను.. తాగి కార్ నడుపుతున్న కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డగించారని, అరెస్ట్ చేయబోతే కాంటాక్ట్స్ వాడి ఆమె ముంబై వెళ్లిపోయిందని కొన్ని వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై “మహర్షి” టీం మెంబర్స్ కానీ పూజా కానీ ఇమ్మీడియట్ గా ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వకపోవడంతో అందరు అది నిజమే అనుకున్నారు. హీరోయిన్ల విషయంలో ఇలాంటివి జరగడం కామన్ కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. ఎందుకంటే.. ఇదివరకూ త్రిష విషయంలో ఈ తరహా సంఘటనలు రెండు మూడు జరిగి ఉండడం అందుకు కారణం.

అయితే.. కాస్త లేట్ గా ఈ విషయమై స్పందించిన పూజ హెగ్డే అసలు తనను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరగలేదని, తాను ఆ రోజు రాత్రే ముంబైలోని తన ఇంటికి వెళ్లిపోయానని.. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో నాకు అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఆమె నటించిన తాజా చిత్రం మహర్షి మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది.

Share.