కాజల్ ను రీప్లేస్ చేసే సీన్ తమన్నాకి లేదు

నిన్న రాత్రి వరకూ బాలీవుడ్ మీడియాలో కాజల్-తమన్నా గురించి పెద్ద చర్చ జరిగింది. కాజల్ ను తమన్నా రీప్లేస్ చేసిందని, కాజల్ పద్ధతి నచ్చని మేకర్స్ ఆమె స్థానంలో తమన్నాను తీసుకొన్నారని భిన్నమైన కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే.. ఈ విషయమై లేట్ చేయకుండా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. “ముంబై సాగా” చిత్ర దర్శకుడు సంజయ్ గుప్తా ఈ పుకార్లపై స్పందిస్తూ.. “కాజల్ చాలా టాలెంటెండ్ & డిసిప్లేన్ ఉన్న ఆర్టిస్ట్.. ఆమెను రీప్లేస్ చేయాల్సిన అవసరం మాకేం ఉంది” అని ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ ను కాజల్ రీట్వీట్ చేసింది. దాంతో అవన్నీ ఉత్తుత్తి గాసిప్పులే అని క్లారిటీ వచ్చేసింది.

war-between-kajal-agarwal-tamanna1

అయితే.. నిజానికి కాజల్ & తమన్నా మంచి స్నేహితులన్న విషయం ఇంకా బాలీవుడ్ కి అర్ధమైనట్లు లేదు. ఎందుకంటే.. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను బట్టి.. ఒకవేళ నిజంగానే కాజల్ కు రీప్లేస్ మెంట్ గా తమన్నాను సంప్రదించినా ఆమె అందుకు ఒప్పుకోదు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం అలాంటిది.

Share.