కరోనా ఎఫెక్ట్…వివి వినాయక్ శీనయ్య అటకెక్కనుందా?

ఒకప్పుడు టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ గా ఉన్న వి వి వినాయక్ హీరోగా టర్న్ తీసుకొని పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన హీరోగా శీనయ్య అనే మూవీ కొద్దిరోజుల క్రితం షూటింగ్ కూడా మొదలైంది. మెకానిక్ గా వినాయక్ మాస్ మేనరిజంతో ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల చేశారు. ఏమైందో తెలియదు తరువాత ఈ మూవీపై అప్డేట్లు రావడం ఆగిపోయాయి. దీనితో అసలు ఈ మూవీ ఏమైంది అనే అనుమానం అందరిలో మొదలైంది. ఈ మూవీపై దిల్ రాజు ఆసక్తి చూపడం లేదని సమాచారం.

ఈ చిత్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజుకి ఈమధ్య ఏమి కలిసి రావడం లేదు. అత్యధిక రేటుకు తెలుగు హక్కులు దక్కించుకొని తెరకెక్కించిన జాను పూర్తిగా నిరాశ పరిచింది. బారి బుడ్జెత్ తో తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ కి చివరి సమయంలో బ్రేక్ పడింది. ఆయన నిర్మించిన మరో మూవీ వి కూడా లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయింది. దీనితో దిల్ రాజు పెట్టుబడి మొత్తం ఫ్రీజ్ అయిపొయింది. వకీల్ సాబ్ మరియు వి చిత్రాలు విడుదల అయితే గాని మళ్ళీ ఆయనకు నిధులు సమకూరవు.

VV Vinayak's Seenayya Movie

ఈ నేపథ్యంలో ఇప్పట్లో శీనయ్య మూవీని తెరకెక్కించే సూచనలు లేవని సమాచారం. ఒక వేళ దిల్ రాజు ఆసక్తి కోల్పోతే శీనయ్య ప్రాజెక్ట్ ను మధ్యలో వదిలేసినా ఆశ్చర్యం లేదు. గతంలో శరభ అనే థ్రిల్లర్ తెరక్కించిన ఎన్ నరసింహారావు ఈ మూవీని తెరకెక్కిస్తుండగా, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూవీ భవిష్యత్తు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.