చిరు కోసం సీఎం కథ రాస్తే..!

మెగాస్టార్ చిరంజీవి కోసం సీఎం కథని రాస్తే.. అది కాస్త మరో సినిమాలో సీన్ల కోసం కలిపేయాల్సి వచ్చిందని దర్శకుడు వి.వి.వినాయక్ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్ చిరంజీవి కోసం రాసుకున్న సొంత కథను ‘ఠాగూర్’ సినిమా కోసం వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆయన మరిన్ని విషయాలను చెబుతూ.. ”కొన్నేళ్ల క్రితం రాజా రవీంద్ర వచ్చి నన్ను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. మొదటి సారి చిరంజీవిని కలవడం అదే. కొంతసేపు మాట్లాడిన తరువాత ‘రమణ’ సినిమా చూశారా..? అని అడిగారు.

చూశానని చెప్పాను. నాకు బాగుంటుందా..? అని అడిగారు. అదిరిపోతుంది చెప్పాను. ఆ సమయంలో క్లైమాక్స్ మార్చాలని చెప్పారు. ఎలా మారుస్తావని చిరు అడిగితే.. అప్పటికే ఆయన కోసం ఓ కథ రాశాను. చిరు సీఎం అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రాసుకున్న కథలోని కొన్ని సన్నివేశాలను చిరంజీవి గారికి చెప్పాను. అలా నాలుగు సిట్టింగ్స్ తరువాత ‘ఠాగూర్’ సినిమా ఓకే అయిందని” వినాయక్ చెప్పారు. ఇలా చిరంజీవి కోసం రాసుకున్న ముఖ్యమంత్రి కథను ‘ఠాగూర్’ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం కలిపేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇక ప్రస్తుతం ఉన్న హీరోల గురించి మాట్లాడుతూ.. మహేష్, పవన్ కళ్యాణ్ లతో సినిమాలు చేయాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. ఎప్పటికప్పుడు వాళ్లతో టచ్ లోనే ఉంటున్నానని.. కానీ టై వచ్చినప్పుడు సినిమా సెట్ అవుతుందని అన్నారు.ఇక తనపై వచ్చే విమర్శలను ఎప్పుడూ పట్టించుకోనని.. సినిమాకి సంబంధించి ప్రతి రోజూ ఏదొకటి నేర్చుకుంటూనే ఉంటానని అన్నారు. త్వరలోనే మంచి టైమ్ చూసి బౌన్స్ బ్యాక్ అవుతానని చెప్పారు ఈ మాస్ డైరెక్టర్.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.