సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న మాస్ డైరెక్టర్..!

దర్శకుడిగా ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు,హిట్లు ఇచ్చిన వివి వినాయక… గత కొంతకాలంగా సరైన హిట్టివ్వలేక సతమతమవుతున్నాడు. గతేడాది హీరో ‘సాయి తేజ్ తో వివి వినాయక్ తెరకెక్కించిన ‘ఇంటెలిజెంట్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ కావడంతో.. వినాయక్ పని అయిపోయిందని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం వినాయక్ దగ్గర స్క్రిప్టులు ఉన్నా కానీ.. ఏ హీరో ఖాళీగా లేడు. దీంతో ఉన్న ఈ చిన్న గ్యాప్ లో ఓ ప్రయోగం చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటివరకూ డైరెక్టర్ గా కొనసాగుతూ వచ్చిన వినాయక్.. మొదటిసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వినాయక్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు దిల్ రాజు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

vv-vinayak-new-look-turned-viral1

సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘శరభ’ ఫేమ్ నరసింహారావు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రం కోసం జిమ్ లో తెగ కసరత్తులు చేస్తూ తన లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నాడు వినాయక్. ఆయన జిమ్లో వర్కౌట్లు చేస్తున్న ఫోటోలు తాజాగా బయటకి వచ్చాయి. ఈ ఫొటోల్లో బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తున్నాడు వినాయక్. ఇటీవల ‘పెళ్ళిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా హీరోగా ఓ సినిమా చేయడానికి చాలా స్లిమ్ గా తయారయ్యి సర్ ప్రైజ్ చేసాడు. ఇప్పుడు వినాయక్ కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నట్టున్నాడు.

Share.