ఇంటెలిజెంట్ విలన్ ని వేటాడే ఆర్మీ ఆఫీసర్

విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చక్ర ట్రైలర్ నేడు విడుదలయ్యింది. సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన బాషలలో ఈ మూవీ విడుదల అవుతుండగా..నాలుగు భాషలలో ట్రైలర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం సైబర్ క్రైమ్స్ ప్రధానంగా తెరకెక్కినదని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అందుబాటులో ఉన్న సాంకేతి పరిజ్ఞానంతో అమాయకులైన జనాన్ని దోచుకునే గ్యాంగ్ మరియు వాళ్ళ లీడర్ చేసే నేర కార్యకలాపాల చుట్టూ ఈ మూవీ తిరిగే సూచనలు ఉన్నాయి.

అంతు దొరకని ఈ కిలాడీ నేరగాళ్లు పోలీస్ వ్యవస్థను ముప్పుతిప్పలు పడుతుండగా వారి పనిబట్టడానికి ఆర్మీ ఆఫీసరైన విశాల్ రంగంలోకి దిగుతాడు. డిజిటల్ ఇండియా పేరుతో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్ లో చేయడం వలన సైబర్ నేరగాళ్లు అమాయకుల సొమ్ము ఎలా దోచుకుంటున్నారు అనేది ఈ మూవీలో స్పష్టంగా చెప్పే అవకాశం కలదు. ఇక ఆర్మీ ఆఫీసర్ గా విశాల్ లుక్ వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇంటెలిజెంట్ విలన్ వేటలో ఆర్మీ ఆఫీసర్ మూమెంట్స్ అలరిస్తాయనిపిస్తుంది.

Vishal's Chakra Movie Trailer Review1

ఇక విశాల్ గత చిత్రాల వలే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో ఉంటాయని ట్రైలర్ ద్వారా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ పోలీస్ రోల్ చేసినట్లున్నారు. మొత్తంగా మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ తో విశాల్ మెప్పించడం ఖాయం అనిపిస్తుంది. ఈ మూవీకి విశాల్ నిర్మాత కాగా ఎమ్ ఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కింది.


కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Share.