విశాల్.. పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని చూసారా..?

కోలీవుడ్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడైన విశాల్ త్వరలోనే పెళ్ళి చేసుబోతున్నట్టు… స్వయంగా విశాల్ తండ్రి జి.కె.రెడ్డినే ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురయ్యింది. గత కొంత కాలంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ లు ప్రేమలో ఉన్నాడని… త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాల్ మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని విశాల్ తండ్రి ప్రకటించడంతో చర్చనీయాంశం అయ్యింది.

ఇక 2019 లోనే విశాల్ పెళ్ళి జరుగబోతోంది. ఎంగేజ్మెంట్ పనులు కూడా చక చకా జరిగిపోతున్నాయి. ఇక ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుందో అని కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ జనాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విశాల్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఈమె పేరు అనీషా.. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన విజయ్ రెడ్డి… పద్మజ దంపతుల కుమార్తె. ఇదిలా ఉండగా.. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన వెంటనే మొదటి పెళ్ళి నేనే.. చేసుకుంటానని విశాల్ ఎప్పుడో చెప్పాడు. 2019 ఏప్రిల్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుంది కాబట్టి …. ఈలోపు నిశ్చితార్ధం జరిపి పెళ్ళి డేట్ ని ఫిక్స్ చేయాలనీ విశాల్ మరియు అనీషా కుటుంబ సభ్యులు భావిస్తున్నారట.

Share.