రానా సినిమాకి ఫ్యాన్సీ రేటు!

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న నూతన చిత్రం ‘విరాటపర్వం’. వెంకీ ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా.. కామ్రేడ్ రవన్న అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ సినిమాపై ఏర్పడిన బజ్ తో ఇప్పటికే థియేటర్ హక్కుల బిజినెస్ ని పూర్తి చేశారు.

ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా అమ్మేశారు. నెట్ ఫ్లిక్స్ హోల్ సేల్ గా ఈ హక్కులను దక్కించుకుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళ ఆన్ లైన్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటుకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రేటు రూ.11 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉందని తెలుస్తోంది. రానాకి అన్ని భాషల్లో ఇప్పటికే పరిచయం ఉండడం, సాయి పల్లవి సౌత్ సినిమా ఇండస్ట్రీలో పేరున్న హీరోయిన్ కావడంతో ఈ సినిమా ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కి మంచి రేటు పలికింది.

ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.