‘విరాట పర్వం’ టీజర్ : మరో పాత్ బ్రేకింగ్ మూవీ అయ్యేలా ఉందిగా..!

దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు అడుగుల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి,సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు వీడియో గ్లిమ్ప్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ లభించింది. ‘కోలో కోలోయమ్మ’ అనే పాట కూడా ఆకట్టుకుంది. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారం చేసుకుని 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించినట్టు స్పష్టమవుతుంది. ‘ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్ళు.. తారతమ్య గోడలనే పికిలింపగ ఎన్నినాళ్ళు.. దున్నేటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి’ అంటూ రానా చెప్పే ఎమోషనల్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. అతని కవిత్వాలను చదువుతూ ప్రేమలో పడిపోయిన అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తుంది. ‘మీరాబాయి కృష్ణుడి కోసం కన్నవాళ్ళను కట్టుకున్న వాళ్ళను వదిలేసి ఎలా వెళ్లిపోయిందో అలా నేను నీకోసం వస్తున్నాను’ అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ అనిపిస్తుంది.

భారతక్కగా ప్రియమణి కనిపిస్తుంది. చాలా రియాలిస్టిక్ అండ్ ఎమోషనల్ గా ఈ టీజర్ సాగింది. కచ్చితంగా ఆకట్టుకునే విధంగానే ఈ టీజర్ ఉంది. సినిమా కూడా అలానే ఉంటే మరో పాత్ బ్రేకింగ్ మూవీ అయినట్టే..! ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా టీజర్ ను ఓ లుక్కెయ్యండి :


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.