రష్మిక మందన అభిమాని వింత ప్రయోగం.. వీడియో వైరల్..!

నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఛలో’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ఆ తరువాత ‘గీత గోవిందం’ ‘దేవదాస్’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ఈమె ఇమేజ్ మరింత పెరిగింది. ఇక 2020 లో మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ అలాగే నితిన్ తో చేసిన ‘భీష్మ’ వంటి చిత్రాలు కూడా విజయం సాధించడంతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగు, కన్నడంలో మాత్రమే కాదు తమిళంలో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇటీవల వచ్చిన కన్నడ డబ్బింగ్ చిత్రం ‘పొగరు’ తో ప్రేక్షకులను పలకరించింది రష్మిక. ఈ చిత్రం తెలుగులో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది కానీ సక్సెస్ ఫుల్ గా నిలబడలేకపోయింది. ఇదిలా ఉండగా.. రష్మిక మందన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి పోస్ట్ పెట్టినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది.ఇదిలా ఉండగా.. ఇటీవల రష్మిక జడలో ఓ అభిమాని మల్లెపూలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

అలా అని నిజంగా కాదు లెండి… ‘పొగరు’ పోస్టర్ లో రష్మిక వైపు నుండీ ఆమె జడలో మల్లెపూలు పెట్టి ఆమెను అలంకరించాడు ఓ అభిమాని. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో నటిస్తుంది. దాంతో పాటు శర్వానంద్ తో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం కూడా చేస్తుంది.


Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.