నేను ప్రేమనిస్తే.. ఈ లోకం విషాన్నిచ్చింది: ఆకట్టుకుంటున్న విక్రమ్ టీజర్

నాగవర్మ బైర్రాజు, దివ్యరావు హీరో హీరోయిన్లుగా నటించిన విక్రమ్ మూవీ టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం కానుకగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. డైరెక్టర్ బాబీ ఈ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేమలో విఫలమైన ఓ భగ్న ప్రేమికుడు అసలేం జరిగిందో తనకు తాను చెప్పుకునేలా టీజర్‌ కట్ చేశారు. తన ప్రేయసితో గడిపిన క్షణాలు , కొండపై ఒంటరిగా ఏడుస్తుండటం ఆ వెంటనే సిగరెట్లు , మద్యం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నేటి యువతకు ఏం కావాలో అన్ని ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇక చివరిలో యాక్షన్ షాట్స్‌తో టీజర్ ముగుస్తుంది. భగ్న ప్రేమికుడిగా, లవర్‌గా, యాక్షన్‌ సీన్లలో నాగవర్మ ఆకట్టుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. డార్క్ ఎఫెక్ట్‌లో హీరో మనోవేదనను సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా చూపించారు. ఆదిత్య ఓం, ఖయ్యూమ్, సురేష్, పృథ్వీ రాజ్, తగుబోతు రమేష్, ఫిష్ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి సుగుణమ్మ సమర్పణలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నాగవర్మ బైర్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సురేశ్ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా, వేణు మురళీధర్ వడ్నాల కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.