30 ఏళ్ల తర్వాత మహేష్ బాబుతో నటిస్తుండడం చాలా ఆనందంగా ఉంది

మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్న రియల్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అప్పట్నుంచి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. రాజకీయాల నుండి స్వల్ప విరామం తీసుకొని సినిమాలపై దృష్టి సారిస్తున్న విజయశాంతి.. “ఆర్ ఆర్ ఆర్”లోనూ గెస్ట్ రోల్ ప్లే చేయనుందని ఊహాగానాలు ఊపందుకోవడంతో ఇటీవల ఆ విషయమై స్పందించింది విజయశాంతి. తాను ఆర్ ఆర్ ఆర్ లో నటించడం లేదని క్లారిటీ ఇవ్వడమే కాక ఇలాంటి వార్తలు నమ్మొద్దని చెప్పుకొచ్చింది.

vijayshanthi-responds-to-rumours-about-rrr-and-sarileru-neekevvaru-movie1

అయితే.. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జూనియర్ మహేష్ బాబుతో “కొడుకు దిద్దిన కాపురం” సినిమాలో నటించిన విజయశాంతి.. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబుతో నటిస్తుండడం మాత్రం చాలా ఆనందంగా ఉందని, అప్పుడు మహేష్ బాబు చాలా చిన్న పిల్లాడు.. ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. షూటింగ్ చాలా చక్కగా సాగుతుంది అని పేర్కొన్నారు విజయశాంతి. మహేష్ బాబు సరసన రష్మిక మండన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share.