‘విజిల్’ డైరెక్టర్ అట్లీ పై కేసు.. కారణం అదే…!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ కుమార్ డైరెక్షన్ లో ‘బిగిల్’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ‘విజిల్‌’ పేరుతో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. విజయ్, అట్లీ కాంబినేషన్లో ‘తేరి’ ‘మెర్సల్’ వంటి బ్లాక్ బస్టర్ లు రావడంతో ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా… ‘అట్లీ నా కథను కాపీ చేశాడంటూ.. ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నంది చిన్ని కుమార్‌ ఆరోపణలు వ్యక్తం చేసాడు. ‘నేను స్పోర్ట్స్ నేపథ్యంలో రాసుకున్న కథలోని సోల్ తీసుకుని ‘విజిల్‌’ సినిమా తీశాడని…. నేను ‘స్లమ్‌ సాకర్’ కాన్సెప్ట్‌తో రాసుకున్న ఓ కథను తమిళ డైరెక్టర్ అయిన అట్లీ ‘విజిల్‌’ అంటూ సినిమా తీశాడు. అంతేకాదు ఈ సినిమా పై.. తెలంగాణ సినిమా రచయితల సంఘం చర్యలు తీసుకోవాలి’ అంటూ పిర్యాదు చేసాడు.

bigil-movie-telugu-rights-acquired-by-east-coast-productions

‘ఇక రెండు కథలు పరిశీలించి, త్వరలోనే ఈ వివాదంపై చర్యలు తీసుకుంటాం’ అంటూ తెలంగాణ సినిమా రచయితల సంఘం చర్యలు చెప్పుకొచ్చింది. తమిళనాడులో కూడా ‘బిగిల్’ సినిమా పై దర్శకుడు కేపీ సెల్వ కేసు పెట్టాడు.’నా కథను కాపీ కొట్టారంటూ’ మద్రాసు హైకోర్టులో సెల్వ కేసు పెట్టాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. ఇలాంటి తరుణంలో అక్టోబర్ 25 న ఈ చిత్రం విడుదలౌతూందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.