‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి విజయశాంతి రేమ్యునరేషన్

దాదాపు 13 ఏళ్ళ తరువాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది మన లేడీ అమితాబ్ విజయశాంతి. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన సూపర్ అనే చెప్పాలి. జనవరి 10 న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్ లను సాధిస్తుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఈ చిత్రానికే ఎక్కువ రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు అని చెప్పడంలో అతిసయోక్తి లేదు.

After 13 years Vijayashanthi is back in Sarileru Neekevvaru

ఇదిలా ఉంటే… ఈ చిత్రం కోసం విజయశాంతి ఏకంగా 1.5 కోట్ల పారితోషికం అందుకుంది. చెప్పాలంటే.. స్టార్ హీరోయిన్ లకు కూడా ఈ స్థాయిలో పారితోషికం ఉండదు. ఈ చిత్రం హిట్ అవ్వడంతో … ఇప్పుడు విజయశాంతి కి మరిన్ని ఆఫర్ లు వస్తున్నాయట. అయితే తల్లి పాత్రలు .. ఈమె చేయదంట. కథకు ప్రాధాన్యత ఉండే పాత్రలే చేస్తుందట.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.