చిరంజీవితో మనస్పర్ధలపై విజయశాంతి రియాక్షన్

లేడీ అమితాబ్ విజయ శాంతి 13 ఏళ్ల తరువాత సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. భారతి అనే నిభద్దత గల కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. కాగా సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవగా వేదికపై వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.నాతో 20సినిమాలలో నటించి స్నేహితురాలికి మించిన కుటుంబ సభ్యురాలిగా మెలిగిన నీకు నన్ను అన్ని మాటలు ఎలా అనిపించాలని పనిపించించింది.. అని చిరు ఆమెను నేరుగా ప్రశ్నించారు. దానికి విజయశాంతి రాజకీయం వేరు, సినిమా వేరని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు.

Vijayashanti about Mega Star Chiranjeevi mahesh babu

కాగా సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న విజయశాంతిని చిరంజీవి మరియు ఆమెకు మధ్య గల రిలేషన్స్ మరియు మనస్పర్థల గురించి అడుగగా ఆమె స్పందించారు. రాజకీయంగా వేరువేరు పార్టీలలో ఉన్న మాఇద్దరి మధ్య మస్పర్దలు వచ్చినా అవి వ్యక్తిగతం కాదు. రాజకీయంగా ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం అన్నారు. ఐతే ఏది మాట్లాడినా ఎవరిని విమర్శించినా అది ప్రజల కోసమే అన్నారు. ఐతే సరిలేరు నీకెవ్వరు వేదిక సాక్షిగా చిరంజీవికి, నాకు మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయి అన్నారు. అలాగే ఇకపై మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు అని చెప్పుకొచ్చారు. ఇక విజయశాంతి రీ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆమె వరుస సినిమాలు చేయనున్నట్లు సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.