విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ గా అంత తీసుకుంటున్నాడా ?

ఫిలిమ్ నగర్ వర్గాల్లో నిన్న ఉదయం నుంచీ ఒక భీభత్సమైన గాసిప్పు చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేయడం కోసం ఏకంగా పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొన్నాడని. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. కాస్త సినిమా పరిజ్ణానమ్ ఉన్నవాళ్ళు మాత్రం విజయ్ అంత డిమాండ్ చేయడు అని అంటుండగా.. మిగతావాళ్లు మాత్రం విజయ్ సేతుపతి ఉన్నాడు కాబట్టి తమిళం, మలయాళంలో విడుదల చేసుకొనే అవకాశం ఉంటుంది, కచ్చితంగా సినిమా రేంజ్ కూడా పెరుగుతుందని ఇంకొందరు భావిస్తున్నారు.

Vijay Sethupathi Allu Arjun Sukumar

ఏదేమైనా సరే సినిమాలో కనిపించే గంట రోల్ కోసం మరీ పది కోట్లు డిమాండ్ చేయడం అనేది కాస్త ఎక్కువే. విజయ్ సేతుపతికి తమిళనాట హీరోగా నటించినా అంత రెమ్యూనరేషన్ ఇస్తారో లేదో తెలియదు. కానీ.. తెలుగులో మాత్రం విలన్ గా నటించడానికి 10 కోట్లు తీసుకొంటుండడం చర్చనీయాంశం అయ్యింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.